సాక్షి,హైదరాబాద్: హైడ్రాకు హైకోర్టులో ఊరట లభించింది. జీవో 99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేదని తెలిపింది. దీంతో హైడ్రాకు ఊరట దక్కినట్లైంది.
కాగా, గతంలో చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టుల్లో ఒకటి చెబుతూ..బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలంటూ...ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారాలను హైడ్రాకు (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి) బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొటెక్షన్‌లో హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధి మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment