సాక్షి,కరీంనగర్ జిల్లా: రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను మళ్లించడానికే కాంగ్రెస్,బీఆర్‌ఎస్ విగ్రహాల లొల్లి ముందుకు తీసుకు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఆరోపించారు.
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సవాల్ ప్రతి సవాల్ ప్రజల దృష్టిని మళ్ళించడానికే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేటిఆర్ కూల్చుతామంటే ఎలా కూల్చుతారో చూస్తామని కాంగ్రెస్ అనడం ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
అసలు విగ్రహాలు సమస్యనా?...రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు అందక సమస్యలతో సతమతం అవుతున్నారు. దానిపై చర్చించకుండా విగ్రహాలపై మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ బోగస్. ఆరు గ్యారంటీ స్కీమ్‌ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలి’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment