‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’ | Group 1 Issue: Bandi Sanjay Takes On Telangana Govt | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’

Published Sat, Oct 19 2024 6:04 PM | Last Updated on Sat, Oct 19 2024 6:28 PM

Group 1 Issue: Bandi Sanjay Takes On Telangana Govt

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. అందుకు జీవో నంబర్‌ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో  కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది.  నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. 

కాంగ్రెస్‌తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది.  తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను  సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.

చదవండి: TG గ్రూప్‌-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement