ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదు
హరీశ్, కేటీఆర్‌లకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్‌ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్‌రావుకు లేదు. బీఆర్‌ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment