సాక్షి,కరీంనగర్‌జిల్లా:తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు అవినీతిమయంగా మారాయని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శించారు.సోమవారం(సెప్టెంబర్30) బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు.‘మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల అవినీతికి తెర లేపారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తోంది.
పేదల ఇండ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా. బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుంది.హైడ్రా మానవత్వం కోణంలో ఆలోచించాలి.ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ అక్రమాలకు తెర లేపారు.వారసత్వ, కుటుంబ పార్టీలను బొందపెట్టే సమయం ఆసన్నమైంది.వారసత్వ రాజకీయాలకు బీజెపీ దూరం.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు’అని బండిసంజయ్ హెచ్చరించారు.
ఇదీచదవండి: మూసీకి లక్షల జీవితాలు బలి
Comments
Please login to add a commentAdd a comment