లంకలో కృష్ణమ్మ విగ్రహం | krishnamma statue | Sakshi
Sakshi News home page

లంకలో కృష్ణమ్మ విగ్రహం

Published Sun, Jul 24 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

లంకలో కృష్ణమ్మ విగ్రహం

లంకలో కృష్ణమ్మ విగ్రహం

నాగాయలంక: 
పుష్కరాల నేపథ్యంలో నాగాయలంక పుష్కర ఘాట్‌ వద్ద నది బ్యాక్‌డ్రాప్‌ అనుసంధానంగా కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ వెల్లడించారు. కృష్ణానది లాంచీలరేవు వద్ద ఘాట్‌ తుదిదశ నిర్మాణ పనులను కృష్ణాడెల్టా చీఫ్‌ ఇంజినీర్‌ వైఎస్‌ సుధాకర్, ఇరిగేషన్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.సుగుణాకరరావుతో కలిసి శనివారం ఆయన పర్యవేక్షించారు. ఘాట్‌ నిర్మాణం, శ్రీరామపాదక్షేత్రం ఆలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఏఎంసీ చైర్మన్‌ మండవ బాలవర్ధిరావు,  సర్పంచ్‌ శీలి రాము, తహశీల్దార్‌ ఎస్‌.నరసింహారావు, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, డీఈ ఎం.మారుతీప్రసాద్‌ పాల్గొన్నారు.
వైభవంగా దివ్యహారతి
సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల భక్తులు స్థానిక ప్రధాన పుష్కరఘాట్‌లో శనివారం రాత్రి 7.30 గంటలకు కృష్ణమ్మకు దివ్యహారతి ఇచ్చారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. తొలుత కృష్ణానదికి దీవి మురళీ ఆచార్యులు, ప్రభాకరశర్మ, తుర్లపాటి రామ్మోహనరావు ప్రత్యేక పూజలు చేశారు. చీర, పసుపు కుంకుమతో సారె సమర్పించారు. మహిళలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. బందరు ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్‌ ఎస్‌.నరసింహారావు, ఎంపీడీవో వి.ఆనందరావు, ఏఎంసీ చైర్మన్‌ మండవ బాలవర్ధిరావు, ఎంపీపీలు సజ్జా గోపాలకృష్ణ, బండే కనకదుర్గ, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ ఎస్‌ఎస్‌వీ మూర్తి పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక నాగసాధువు బాలాజీ ఆధ్వర్యంలో కృష్ణానదికి పూజలు చేసి హారతులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement