
నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక రేవులో జెల్లీఫిష్‌లు కనువిందు చేస్తున్నాయి. నాగాయలంక ఎగువ వరకూ సముద్రపు జలాలే (బ్యాక్ వాటర్) కావడంతో జెల్లీఫిష్‌లు, ఇతర సముద్ర చేపలు అధిక సంఖ్యలో చేరుతున్నాయి. ఆవలి తీరంలో వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో సందర్శకులు బోtట్‌లో వెళ్లి చూస్తున్నారు. ఆటవిడుపుగా జెల్లీఫిష్‌లను పట్టుకుని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.