పుష్కరాలకు ఆహ్వానం ఏదీ!
సినీ రంగానికి చెందినవారందరినీ పుష్కరాలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు ఏవిధమైన ఆహ్వానపత్రాలు ఇవ్వకుండా అవమానించిందని శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గురువారం ఆమె స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పామర్రు :
సినీ రంగానికి చెందినవారందరినీ పుష్కరాలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు ఏవిధమైన ఆహ్వానపత్రాలు ఇవ్వకుండా అవమానించిందని శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గురువారం ఆమె స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆహ్వానపత్రాల గురించి సంబంధిత అధికారులను అడిగితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడం శోచనీయమని, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వానికి ఏపాటి శ్రద్ధ ఉన్నదో అర్ధమవుతోందన్నారు. నియోజకవర్గంలోని తొమ్మిది ఘాట్లపై స్థానిక ఎమ్మెల్యేతో సమీక్షలు, సమావేశాలు లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులను దిష్టిబొమ్మల్లా, ఉత్సవ విగ్రహాలుగా చేసిన ఘనత చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. అసలు ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.