సీతానగరం ఘాట్ వద్ద బారికేడ్లు తొలగింపు
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు. భారీ అంచనాలతో కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసింది. అందులో భాగంగా దుర్గా, కృష్ణవేణి, పున్నమి, సీతానగరం, పద్మావతి, తాళ్లాయపాలెం, అమరావతి, పవిత్రసంగమం ఘాట్‌లు ముఖ్యమైనవి. ఒక్కో ఘాట్‌కు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసింది. ఘాట్ వద్ద రూ.15 లక్షలతో ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లలలో సీతానగరం ఘాట్‌కు ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని భావించిన అధికారయంత్రాంగం ఉండవల్లి సెంటర్ నుంచి మూడులైన్ల బారికేడ్లను ఏర్పాటు చేసింది. కాని ఆ మేరకు యాత్రికులు రాకపోవడంతో ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారు.