ఇలాగైతే.. పిండ ప్రదానం కష్టమే
Published Sat, Aug 13 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
విజయవాడ(గాంధీనగర్) :
పుష్కరాల్లో పుణ్యనదీస్నానం, పెద్దలకు పిండ ప్రదానం చేయడమే అతి ముఖ్యమైన కార్యక్రమం. రెండు నెలలుగా ఉరుకులు, పరుగులు పెట్టి పనులు చేయించిన అధికారులు ప్రారంభం నాటికి పనులు నూరు శాతం పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా పవిత్ర సంగమం ఘాట్ వద్ద పిండ ప్రదానం చేసేందుకు వీలుగా నిర్మించిన షెడ్డు చిన్నదిగా ఉంది. చాలా కొద్దిమంది మాత్రమే పిండ ప్రదానాలు చేసుకునేందుకు వీలుగా షెడ్డు నిర్మించారు. ప్రభుత్వం పిండప్రధానం కార్యక్రమానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని పురోహితులు ఆరోపిస్తున్నారు. సంగమం వద్ద సీఎం నది హారతి ఇవ్వడంతో ఘాట్‌కు ప్రాధాన్యం∙పెరిగిందని, భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉందని పురోహితులు అంటున్నారు.
మహిళలకు ఇక్కట్లు..
మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఘాట్‌లో కేవలం ఆరు మాత్రమే క్యాబిన్లు ఏర్పాటు చేశారు, క్యాబి¯Œæలో రెండేసి గదులున్నాయి. వాటిల్లో ఏకకాలంలో కేవలం 12 మంది మాత్రమే దుస్తులు మార్చుకునేందుకు వీలుంది. దీంతో పాటు మీడియాపాయింట్‌కు సమీపంలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా టెంట్ వేశారు. పై భాగంలో ఓపెన్‌గా వదిలేశారు. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దుస్తులు మార్చుకునేందుకు వీలుగా మరిన్ని గదులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Advertisement