embryonic awarded
-
అవ్వకు ఎంత కష్టం
గుణదల : నా.. అన్నవారు ఎవరూ లేరు.. కట్టుకున్నవారు.. కన్నవారు గతించారు.. మిగిలింది నేనొక్కదానే.. మాది శ్రీకాకుళం జిల్లా వండవ... అని చెబుతున్న ఆవాల అప్పల నర్సమ్మ (75) ఒక్కరే పిండ ప్రదానం చేస్తుంటే... అయ్యో ఈ ముసలవ్వకు ఎంత కష్టం వచ్చింది అని పలువురు కళ్లొత్తుకున్నారు. సోమవారం పద్మావతి ఘాట్‌లో తన భర్త, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లకు ఆమె పిండ ప్రదానం చేసింది. గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తన కుటుంబీకులందరూ చనిపోయారని, తాను ఒక్కదాన్నే మిగిలానని, అకాల మరణం చెందిన తన కుటుంబ సభ్యుల ఆత్మలు శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఒక్కదాన్నే వచ్చాచని ఆమె తెలిపారు. -
తరతరాల చరిత్ర
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : ఎవరెవరికి పిండప్రదానాలు చేయాలో కాగితంపై రాసుకొచ్చా... ప్రతి పేరుకు తప్పకుండా చదవాలి....ఇదీ పుష్కరాలలో పిండ ప్రదానాలు చేసే చోట కనిపించే దృశ్యాలు... 12 ఏళ్లకు వచ్చే పుష్కరాలలో పిండ ప్రదానం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తండ్రి, తాతలు, ముత్తాతలు.. ఇలా రక్తసంబంధీకుల వివరాలను పిండ ప్రదాన సమయంలో గుర్తు చేసుకుని చెప్పడం కాసింత కష్టమే.. అందుకే కొంతమంది పెద్దవాళ్లు.. వారి వారి వంశంలో పిండ ప్రదానం చేయాల్సిన పేర్లు, వివరాలు గుర్తుగా కాగితాలపై రాసుకుని మరీ పురోహితుడికి అందచేస్తున్నారు. ఒక్కో యాత్రికుడయితే వందకు తక్కువ కాకుండా పేర్లు రాసి పురోహితుడికి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. పురోహితులు సైతం పిండప్రదానం చేసే సమయంలో ఎంత మంది పేర్లు ఉన్నాయని మరీ అడిగిన తర్వాతే బేరం కుదుర్చుకుంటున్నారు. -
ఇలాగైతే.. పిండ ప్రదానం కష్టమే
విజయవాడ(గాంధీనగర్) : పుష్కరాల్లో పుణ్యనదీస్నానం, పెద్దలకు పిండ ప్రదానం చేయడమే అతి ముఖ్యమైన కార్యక్రమం. రెండు నెలలుగా ఉరుకులు, పరుగులు పెట్టి పనులు చేయించిన అధికారులు ప్రారంభం నాటికి పనులు నూరు శాతం పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా పవిత్ర సంగమం ఘాట్ వద్ద పిండ ప్రదానం చేసేందుకు వీలుగా నిర్మించిన షెడ్డు చిన్నదిగా ఉంది. చాలా కొద్దిమంది మాత్రమే పిండ ప్రదానాలు చేసుకునేందుకు వీలుగా షెడ్డు నిర్మించారు. ప్రభుత్వం పిండప్రధానం కార్యక్రమానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని పురోహితులు ఆరోపిస్తున్నారు. సంగమం వద్ద సీఎం నది హారతి ఇవ్వడంతో ఘాట్‌కు ప్రాధాన్యం∙పెరిగిందని, భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉందని పురోహితులు అంటున్నారు. మహిళలకు ఇక్కట్లు.. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఘాట్‌లో కేవలం ఆరు మాత్రమే క్యాబిన్లు ఏర్పాటు చేశారు, క్యాబి¯Œæలో రెండేసి గదులున్నాయి. వాటిల్లో ఏకకాలంలో కేవలం 12 మంది మాత్రమే దుస్తులు మార్చుకునేందుకు వీలుంది. దీంతో పాటు మీడియాపాయింట్‌కు సమీపంలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా టెంట్ వేశారు. పై భాగంలో ఓపెన్‌గా వదిలేశారు. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దుస్తులు మార్చుకునేందుకు వీలుగా మరిన్ని గదులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
దేవాదాయశాఖ విఫలం !
సాక్షి, విజయవాడ : పుష్కరాలంటే తొలుత పుణ్యస్నానం.. తరువాత పితృదేవతలకు పిండ ప్రదానం గుర్తుకు వస్తాయి. అటువంటి పిండ ప్రదానాలు చేయడానికి కనీస ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పురోహితులకు సకాలంలో గుర్తింపు కార్డులు జారీ చేయడంలోనూ దేవాదాయశాఖ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయిందని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురోహితులకు నరకం.. 1992, 2004 పుష్కరాల సందర్భంగా దేవాదాయశాఖ రెండు నెలలు ముందుగా పురోహిత పెద్దలు, పురోహితlసంఘాల నేతలతోనూ సమావేశం ఏర్పాట్లు చేసి చర్చించింది. ఈసారి అందుకు భిన్నంగా పత్రికల్లో నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. మే నెలలో పురోహితులు పుష్కరాల్లో పిండ ప్రదానాలకు దరఖాస్తులు చేసుకున్నారు. పుష్కరాలకు పక్షం రోజు ముందు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఈ కార్డులలో ఏమాత్రం స్థానికత పాటించలేదు. గట్టు వెనక కామకోటి నగర్‌లోని బ్రాహ్మణులకు కృష్ణలంక ఘాట్లలోనూ, కృష్ణలంక, సత్యనారాయణపురం పురోహితులకు ఫెర్రి, భవానీ, పున్నమి ఘాట్లలోనూ విధులు వేశారు. అనేక వందల మంది స్థానిక బ్రాహ్మణులకు కార్డులు ఇవ్వలేదు. బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లడంతో ఘాట్లు ఆంక్షలు పెట్టవద్దని, అడిగిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వమని మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఈనెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నవారికి పదో తేదిన కార్డులు ఇస్తామని చెప్పారు. తరువాత 11వ తేదీ ఉదయం కౌతావారి సత్రంలో ఇస్తామని చెప్పారు. అక్కడ నుంచి రైల్వేస్టేడియానికి మార్చారు. చివరకు 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత కార్డులు జారీ చేశారు. అనేక మంది పురోహితులు తొలిఘాట్లకు వెళ్లలేకపోయారు. ఘాట్లలో సౌకర్యాలు నిల్.. ఘాట్‌లో పిండ ప్రదానాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడ కేవలం రెండు చిన్న షెడ్లు వేశారు. ఇక పిండాలు ఘాట్‌లో కాకుండా నదిలో వేసేందుకు ఏ విధమైన ప్రత్యేక ఏర్పాట్లు లేవు. వృద్ధులు, వికలాంగుల మాటేమిటి.? పిండ ప్రదానం చేసేవారిలో ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వారే ఉంటారు. ఇక 70 ఏళ్లు దాటిన వారు కూడా ఆసక్తి చూపుతారు. వీరంతా క్రింద కూర్చోలేకపోవచ్చు. క్రింద కూర్చుని చేయలేని అనేకమంది వృద్ధులు ఏర్పాట్లపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఘాట్లలో పిండ ప్రదాన కేంద్రాలు పెంచాలని, వృద్ధులకు బల్లలు, కుర్చీలు ఏర్పాటుపై దేవాదాయశాఖ దృష్టి సారించాలని పురోహిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భక్తుల అగచాట్లు! కృష్ణా పుష్కరాలు తొలి రోజున స్నాన ఘాట్టాల్లో భక్తులు నామమాత్రంగా దర్శనం ఇచ్చారు. ఒకవైపు శ్రావణ శుక్రవారం.. పోలీసు ఆంక్షలతోడు పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు చేదు అనుభవమే మిగిలింది. పుష్కర స్నానం తరువాత మంచినీళ్లు తాగేందుకు వాటర్ బాటిల్స్ కాదు కదా.. ప్యాకెట్లు లభించలేదు. ఎండలో మంచినీళ్లు లేక వృద్ధులు, పిల్లలు నానా అగచాట్లు పడ్డారు. స్థానికులకు ప్రత్యక్ష నరకం.. వన్‌టౌన్‌లో నివాసితులు ప్రత్యక్ష నరకం చూశారు. కాళేశ్వరరావు మార్కెట్ దాటì ద్విచక్ర వాహనాలను లోపలకు అనుమతించలేదు. తమ ఇళ్లు బ్రాహ్మణవీధి, మార్వాడీ వీధి, శివాలయం వీధుల్లో ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కృష్ణలంకలోనూ ఇదే పరిస్థితి. తెలుగు తమ్ముళ్లు గుర్రు.. కారు బయటకు తీయాలంటేవీఐపీ పాస్ తప్పనిసరి. నగరంలో కేవలం ఐదు వందల వీఐపీ పాస్‌లు మంజూరు చేశారు. ఇవన్నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకే సరిపోయాయి. -
15 రకాల వస్తువులతో ప్యాకింగ్
సిద్ధం చేస్తున్న డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద తక్కువ ధరకే విక్రయం హనుమాన్‌పాలెం(కొల్లిపర) : కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానానికి అవసరమైన వస్తువులను మండలంలోని హనుమాన్‌పాలెం గ్రామంలో ప్యాకింగ్ చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద పిండ ప్రదానాలకు అవసరమైన వస్తువులను భక్తులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అవసరమైన వస్తువులను చక్కగా ప్యాకింగ్ చేసే బాధ్యతను అధికారులు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. క్రమంలో హనుమాన్‌పాలెం గ్రామానికి చెందిన ఆసంటి రత్నకుమారికి 20 వేల ప్యాకెట్ల తయారీ బాధ్యతను అప్పగించారు. ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న సుగాలీకాలనీకి చెందిన మహిళలతో ప్యాకింగ్ పని చేయిస్తున్నారు. మొత్తం 15 రకాల వస్తువులతో 20 వేల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ 25 మంది మహిళలు మూడు రోజులుగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వీరికి కొందరు పురుషులు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల వస్తువుల ప్యాకింగ్‌ను పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రత్నకుమారి చెప్పారు. ప్యాకెట్లో ఉండే వస్తువుల వివరాలు.. పసుపు, కంకుమ, హారతి కర్పూరం, సాంబ్రానీ కడ్డీలు, గంథం, ఇస్తరాకులు, బెల్లం, నూములు, బియ్యంపిండి, బియ్యం, వక్కలు, తమలపాకులు, అరటికాయ, అవునెయ్యి, అవుపాలు. వీటన్నింటిని విడివిడిగా ప్యాకింగ్ చేయడంతోపాటు అన్ని కలపి ఒక సంచిలో ప్యాకింగ్ చేస్తున్నారు. -
పుష్కర స్నానం.. పిండ ప్రదానం
గోదారి తీరంలో భక్తజనం పితదేవతలకు తర్పణాలు అమావాస్య కావడంతో ప్రాధాన్యం గోదావరి అంత్య పుష్కరాల మూడో రోజు మంగళవారం అమావాస్య కావడంతో పితృదేవతలకు తర్పణాలు వదిలారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించారు. దీపారాధన చేసిన తరువాత వాటిని భక్తి శ్రద్ధల నడుమ నీటిలో విడిచారు. స్నానఘట్టాల రేవులో పితృదేవతలకు పూజలు చేసి.. పిండాలను గోదావరిలో వదిలారు. భద్రాచలం : గోదావరి తీరం ఉప్పొంగింది. భక్తజన సందోహంగా మారింది. గోదావరి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మూడోరోజు మంగళవారం అమావాస్య కావడంతో భక్తులు ఒకింత పలుచబడినా.. బుధవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుండటంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేశారు. స్నానఘట్టాల రేవులో గోదావరి మాతకు పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. దీపారాధన చేసిన తరువాత వాటిని భక్తి శ్రద్ధల నడుమ నీటిలో వదిలారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు గోదారి తీరంలో పుణ్యస్నానాలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపారు. ఓవైపు భక్తిభావం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతల నడుమ స్నానాలు ఆచరించారు. గోదావరి ఒడ్డున ఉన్న అభయాంజనేయస్వామి, సుబ్రమణేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు. పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామివారికీ పూజలు నిర్వహించి, దేవస్థానం అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. పితృతర్పణాలకు ప్రాధాన్యం పుష్కరాల మూడో రోజైన మంగళవారం అమావాస్య కావటంతో పుష్కరస్నానం చేసే భక్తులు కొంతమేర తగ్గారు. గోదావరి తీరంలో పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు పలువురు ప్రాధాన్యం ఇచ్చారు. స్నానఘట్టాల రేవులో పితృదేవతలకు పూజలు చేశారు. పిండాలను గోదావరిలో వదిలారు. మృతిచెందిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పేరిట పూజలు చేసి గోదావరిలో తర్పణాలు వదిలారు. వసతి లేక ఇబ్బందులు గోదావరి తీరంలో భక్తులు వేచి ఉండేందుకు ఎటువంటి వసతి లేకపోవటంతో ఇబ్బంది పడ్డారు. మంగళవారం రోజంతా వర్షం పడుతూనే ఉండటంతో స్నానమాచరించిన అనంతరం ఎటువంటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బంది పడ్డారు.