అవ్వకు ఎంత కష్టం
అవ్వకు ఎంత కష్టం
Published Mon, Aug 22 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
గుణదల :
నా.. అన్నవారు ఎవరూ లేరు.. కట్టుకున్నవారు.. కన్నవారు గతించారు.. మిగిలింది నేనొక్కదానే.. మాది శ్రీకాకుళం జిల్లా వండవ... అని చెబుతున్న ఆవాల అప్పల నర్సమ్మ (75) ఒక్కరే పిండ ప్రదానం చేస్తుంటే... అయ్యో ఈ ముసలవ్వకు ఎంత కష్టం వచ్చింది అని పలువురు కళ్లొత్తుకున్నారు. సోమవారం పద్మావతి ఘాట్‌లో తన భర్త, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లకు ఆమె పిండ ప్రదానం చేసింది. గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తన కుటుంబీకులందరూ చనిపోయారని, తాను ఒక్కదాన్నే మిగిలానని, అకాల మరణం చెందిన తన కుటుంబ సభ్యుల ఆత్మలు శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఒక్కదాన్నే వచ్చాచని ఆమె తెలిపారు.
Advertisement
Advertisement