తరతరాల చరిత్ర
తరతరాల చరిత్ర
Published Wed, Aug 17 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
ఎవరెవరికి పిండప్రదానాలు చేయాలో కాగితంపై రాసుకొచ్చా... ప్రతి పేరుకు తప్పకుండా చదవాలి....ఇదీ పుష్కరాలలో పిండ ప్రదానాలు చేసే చోట కనిపించే దృశ్యాలు... 12 ఏళ్లకు వచ్చే పుష్కరాలలో పిండ ప్రదానం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తండ్రి, తాతలు, ముత్తాతలు.. ఇలా రక్తసంబంధీకుల వివరాలను పిండ ప్రదాన సమయంలో గుర్తు చేసుకుని చెప్పడం కాసింత కష్టమే.. అందుకే కొంతమంది పెద్దవాళ్లు.. వారి వారి వంశంలో పిండ ప్రదానం చేయాల్సిన పేర్లు, వివరాలు గుర్తుగా కాగితాలపై రాసుకుని మరీ పురోహితుడికి అందచేస్తున్నారు. ఒక్కో యాత్రికుడయితే వందకు తక్కువ కాకుండా పేర్లు రాసి పురోహితుడికి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. పురోహితులు సైతం పిండప్రదానం చేసే సమయంలో ఎంత మంది పేర్లు ఉన్నాయని మరీ అడిగిన తర్వాతే బేరం కుదుర్చుకుంటున్నారు.
Advertisement