పుష్కరాలపై ఎన్‌జీసీ డాక్యుమెంటరీ | ngc documentary on puskaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలపై ఎన్‌జీసీ డాక్యుమెంటరీ

Published Fri, Aug 19 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

పుష్కరాలపై ఎన్‌జీసీ డాక్యుమెంటరీ

పుష్కరాలపై ఎన్‌జీసీ డాక్యుమెంటరీ

విజయవాడ(గుణదల) : 
కృష్ణా పుష్కరాలు–2016పై నేషనల్‌ జాగ్రఫీ చానల్‌ డాక్యుమెంటరీ తీస్తోంది. జిల్లాలోని వివిధ ఘాట్‌ల్లో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించే విధానం, పిండ ప్రదానం చేసే పద్ధతి, దానాలు ఇచ్చే అంశాలపై గంట నిడివి ఉండే డాక్కుమెంటరీ తీయనుంది.

ఈ చానల్‌లో ప్రసారమయ్యే ఇన్‌సైడ్‌ ఇండియా అనే కార్యక్రమంలో కృష్ణాపుష్కరాల ప్రాశస్త్యాన్ని, నదీ పరీవాహక ప్రాంతాల విశిష్టతలను, పుణ్యక్షేత్రాలను, ఇక్కడి ఆచార వ్యవహారాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నారు. అందుకోసం చానల్‌ బృదం పద్మావతి ఘాట్‌లో శుక్రవారం ఉదయం గంటపాటు వీడియో షూటింగ్‌ తీశారని అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement