ngc
-
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
అనంతపురం ఎడ్యుకేషన్ : పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ గ్రీన్‌కోర్ (ఎన్జీసీ) ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ వద్ద జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ర్యాలీని ప్రారంభించారు. సప్తగిరి సర్కిల్ వరకు సాగింది. అనంతరం మారుతీనగర్‌లోని గుడ్‌చిల్డ్రన్ స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్జీసీ కోఆర్డినేటర్ ఆనంద భాస్కర్‌రెడ్డి, సైన్స్ సెంటర్ క్యూరేటర్ వెంకట రంగయ్య, ఫిజిక్స్ రీసోర్స్‌పర్సన్ డాక్టర్ కేశవరెడ్డి, హెచ్ఎం నారపరెడ్డి మాట్లాడారు. -
పుష్కరాలపై ఎన్జీసీ డాక్యుమెంటరీ
విజయవాడ(గుణదల) : కృష్ణా పుష్కరాలు–2016పై నేషనల్ జాగ్రఫీ చానల్ డాక్యుమెంటరీ తీస్తోంది. జిల్లాలోని వివిధ ఘాట్‌ల్లో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించే విధానం, పిండ ప్రదానం చేసే పద్ధతి, దానాలు ఇచ్చే అంశాలపై గంట నిడివి ఉండే డాక్కుమెంటరీ తీయనుంది. ఈ చానల్లో ప్రసారమయ్యే ఇన్సైడ్ ఇండియా అనే కార్యక్రమంలో కృష్ణాపుష్కరాల ప్రాశస్త్యాన్ని, నదీ పరీవాహక ప్రాంతాల విశిష్టతలను, పుణ్యక్షేత్రాలను, ఇక్కడి ఆచార వ్యవహారాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నారు. అందుకోసం చానల్ బృదం పద్మావతి ఘాట్‌లో శుక్రవారం ఉదయం గంటపాటు వీడియో షూటింగ్ తీశారని అధికారులు తెలిపారు.