పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ | Survival with environmental conservation | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ

Published Mon, Jun 5 2017 10:49 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Survival with environmental conservation

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  నేషనల్‌ గ్రీన్‌కోర్‌ (ఎన్‌జీసీ) ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులతో సోమవారం ర్యాలీ నిర్వహించారు.

స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ర్యాలీని ప్రారంభించారు. సప్తగిరి సర్కిల్‌ వరకు సాగింది. అనంతరం మారుతీనగర్‌లోని గుడ్‌చిల్డ్రన్‌ స్కూల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్‌జీసీ కోఆర్డినేటర్‌ ఆనంద భాస్కర్‌రెడ్డి, సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌ వెంకట రంగయ్య, ఫిజిక్స్‌ రీసోర్స్‌పర్సన్‌ డాక్టర్‌ కేశవరెడ్డి, హెచ్‌ఎం నారపరెడ్డి మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement