
పుష్కరాల్లో డ్రోన్ ఎంతో కీలకం
కృష్ణా పుష్కరాల్లో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు.
పుష్కరాల సమయంలో వీటిని వినియోగించనున్న బృందానికి నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. డ్రోన్ ద్వారా సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే ఆ సమాచారాన్ని అధికారులు అందజేస్తారన్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచవచ్చని పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా వచ్చే సమాచారం కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.