పుష్కరాలకు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం
పుష్కరాల సందర్భంలో అన్ని టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు ఏ కోరారు. శనివారం తన చాంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయన్స్, టాటా డొకోమో తదితర కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
విజయవాడ :
పుష్కరాల సందర్భంలో అన్ని టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు ఏ కోరారు. శనివారం తన చాంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయన్స్, టాటా డొకోమో తదితర కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బాబు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు జిల్లాలో గుర్తించిన 91 ఘాట్ల సెక్టార్ల పరిధిలో 3.50 కోట్లకు పైగా పుష్కర యాత్రికులు రానున్నారని తెలిపారు. ఈ రద్దీని గుర్తించి ఆరు ముఖ్య రోజుల్లో 40 లక్షల మంది వరకు రాగలరనే అంచనాతో ఉన్నామని తెలిపారు. యాత్రికులకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సేవలందించాలని కోరారు. ఇంట్రా సర్కిల్ రోమింగ్‌లో సదుపాయాన్ని అందించాలని సూచించారు. ఈ నెల 10 తేదీ సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని నెట్ వర్క్ ప్రతినిధులను కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన పాల్గొన్నారు.