గుంటూరు(నగరంపాలెం) :
పుష్కరాల దృష్ట్యా గుంటూరు డివిజను మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజను అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఎండీ ఆలీఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
12705/12706గుంటూరు–సికింద్రాబాద్–గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 17221/17222 కాకినాడ–లోక్‌మాన్యతిలక్ టెర్మినల్స్–కాకినాడ ఎక్స్‌ప్రెస్, 17211/17212 మచిలీపట్నం–యశ్వంత్‌పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్, 57327/57328 గుంటూరు–డోన్–గుంటూరు ప్యాసింజర్ రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా రెండు జనరల్æబోగీలు ఏర్పాటు చేయనున్నారు.
57317/57324 గుంటూరు–మాచర్ల–గుంటూరు ప్యాసింజరు, 57381/57382 గుంటూరు– నర్సాపూర్–గుంటూరు ప్యాసింజరు రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా మూడు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు.
17225/17226 విజయవాడ–హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 10 నుంచి 25 తేదీ వరకు అదనంగా నాలుగు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57620/57619 కాచిగూడ–రేపల్లె–కాచిగూడ ప్యాసింజర్ రైలుకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా ఒక జనరల్ బోగీని ఏర్పాటు చేయనున్నారు.
08405/08406 పూరీ–గుంటూరు–పూరీ ప్రత్యేక రైలుకు ఆగస్టు 11,12,16,17,19,20,22,23 తేదీల్లో రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఒక ఏసీ త్రీటైర్‌కోచ్, రెండు స్లీపర్ కోచ్‌లు, 12705/12706 సికింద్రాబాద్–గుంటూరు–సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
12747/12748 గుంటూరు–వికారాబాద్–గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, 12796/12795 సికింద్రాబాద్–విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నాలుగు సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 08507/08508 గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 11 నుంచి 23వ తేదీ వరకు రెండు స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
దసరా సెలవుల రద్దీకి..
దసరా సెలవుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–తిరుపతి–విశాఖపట్నంకు న్యూగుంటూరు రైల్వేస్టేçÙన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 82851 విశాఖపట్నం – తిరుపతి ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3,10,17,24,31, నవంబరు 7,14 తేదీలు, 82852 తిరుపతి–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4,11,18,25, నవంబరు 1,8,15 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లలో ఒక ఏసీ టూటైర్, మూడు ఏసీ త్రీటైర్, తొమ్మిది స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్ బోగీలు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు.