24 గంటల వైద్యసేవలు
పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలో వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవల ఏర్పాట్లను మంగళవారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఘాట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను 24 గంటలపాటు మూడు షిప్‌్టలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో సుమారు 13 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య
అమరావతి :
పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలో వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవల ఏర్పాట్లను మంగళవారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఘాట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను 24 గంటలపాటు మూడు షిప్‌్టలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో సుమారు 13 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్టు వైద్యులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొబైల్ పార్టీలు , ఘాట్‌లలో అంబులెన్స్‌ను సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. తొలుత అమె అమరేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. ధ్యానబుద్ధ ఘాట్ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట అరోగ్యశాఖ డైరెక్టర్ అరుణకుమారి, పుష్కరాల ప్రత్యేకాధికారి కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీ సాయిబాబు, అత్తలూరు పీహెచ్‌సీ వైద్యాధికారులు స్వప్న, కిరణ్‌కుమార్, డీడీ నాయక్ ఉన్నారు.