8 రోజుల్లో రూ.8 కోట్ల ఆదాయం
సాక్షి, విజయవాడ :
కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు రైల్వేశాఖ అన్ని సౌకర్యాకల్పిస్తోందని డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం రైల్వేస్టేçÙన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే...
8 రోజుల్లో 6,90,510 మంది ప్రయాణికులు విజయవాడ నుంచి ప్రయాణిం చగా రూ.8. 32 కోట్ల ఆదాయం వచ్చింది. షెడ్యూల్డ్ రైళు ్లకాకుండా 626 అదనపు రైళ్లు వేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న విశాఖపట్నం వైపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. 97శాతం రైళ్లు నిర్ణీత సమయంలో నడుస్తున్నాయి.
భక్తుల సౌకర్యం కోసం పున్నమి ఘాట్, సంగమం ఘాట్, బస్టాండ్‌ల వద్ద మిషన్లు పెట్టి రైలు టికెట్లను విక్రయిస్తున్నారు. పార్శిల్ ఆఫీసు వైపు, తారాపేట వైపు, స్టేడియంలోనూ ఏర్పాటు చేసిన పుష్కర నగర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
∙అవసరం లేకపోవడంతో డబుల్ డెక్కర్ రైలును నడపడం లేదు. పుష్కరాల్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క పిక్‌పాకిటింగ్ జరిగితే నిందితుడ్ని వెంటనే పట్టుకున్నామరు. పోలీసులు పూర్తి అప్రమత్తతో ఉండి నేరాలు జరగకుండా చూస్తున్నారు. విలేకరుల సమావేశంలో చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ గాంధీ, ఏసీఎం రాజశేఖర్ పాల్గొన్నారు.