యాగప్రసాదం అందుకున్న వైఎస్‌ జగన్‌ | Yaga Prasadam to YS Jagan by Vara Prasad Reddy | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 29 2018 12:25 PM | Last Updated on Mon, Oct 8 2018 4:55 PM

Yaga Prasadam to YS Jagan by Vara Prasad Reddy - Sakshi

సాక్షి, నెల్లూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముందుకు సాగుతున్న వేళ.. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఆరిమండ వరప్రసాద్ రెడ్డి యాగం నిర్వహిస్తున్నారు. ఎన్నికల దాకా ఈ మహారుద్ర సహిత సహస్ర చండి యాగ మహోత్సవం కొనసాగుతుంది. 

ఈ మహోత్సవంలో భాగంగా 28-01-2018 తేదీన ద్విశత రుద్రహోమం, త్రిశత చండీహోమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించిన జగన్‌ను వరప్రసాద్‌రెడ్డి కలిసి ప్రసాదం అందజేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement