
మహా సంకల్పానికి జనం బాధ్యత కలెక్టర్లకే
మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న మహా సంకల్పం సభను ప్రమాణ స్వీకారోత్సవ సభ ఖర్చుకంటే రెట్టింపు ఖర్చుతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సభకు జన సమీకరణ బాధ్యతలు ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ మౌఖికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. గుంటూరు నాగార్జున వర్సిటీ వద్ద జరిగే సభకు నాలుగు లక్షల మంది వచ్చేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు.
ఆదివారం సచివాలయంలో సీఎస్ కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహా సంకల్పం సభకు సర్వం సిద్ధం
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మహా సంకల్పం సభకు గుంటూరు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణానికి సమీపంలో ప్రత్యేకంగా మూడు హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. కోల్‌కతా, చెన్నై నుంచి కళాబృందాలను రప్పించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.