నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన 'మహా సంకల్పం' సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్: నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన 'మహా సంకల్పం' సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోల్కతా నుంచి చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు వందల కొద్దీ నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.
విజయవాడ - గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు గంటల కొద్దీ ట్రాఫిక్లోనే ఇరుక్కు పోవాల్సి వచ్చింది. అధికారులు, టీడీపీ నేతల తీరును ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. మీడియా సంస్థలకు వందలకొద్దీ ఫోన్లు చేశారు. మహా సంకల్పం సభతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవించారు.