మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలితీసుకుంది.
మచిలీపట్నం (కృష్ణా జిల్లా): మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలితీసుకుంది. బాధితుల బంధువుల కథనం మేరకు... కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన అనిరాజు వీరాంజనేయులు(29), వెంకటనారాయణపురానికి చెందిన తమ్ము ఏడుకొండలు (29) స్నేహితులు. వీరు బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగివస్తున్నారు.
అదే సమయంలో మచిలీపట్నం నుంచి టీడీపీ కార్యకర్తలతో గుంటూరు జిల్లాలో జరుగుతున్న మహాసంకల్పం బహిరంగ సభకు వెళుతున్న బస్సు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరాంజనేయులు, ఏడుకొండలను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు.