
సెల్‌ఫోన్ ద్వారా పంపుసెట్ల మానిటరింగ్
సెల్‌ఫోన్ల ద్వారా పంపుసెట్లను మానిటరింగ్ చేసే విధానాన్ని త్వరలో అమలుచేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో నిర్వహించిన మహాసంకల్పసభలో పాల్గొని, అందరితో ప్రతిజ్ఞ చేయించిన తర్వాత ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ అందజేస్తామని, 10 లక్షల మంది రైతులకు ఒక్కొక్కటీ రూ. 50 వేల విలువైన పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పారు.
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని, విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ జరిగిపోవని.. విరివిగా నిధులు రావాలని చంద్రబాబు మరోసారి అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 149కే ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.