మంగళగిరిలోని నాగార్జునసాగర్‌లో సోమవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాసంకల్పదినోత్సవ సభపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
గుంటూరు: మంగళగిరి నాగార్జునసాగర్‌లో సోమవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాసంకల్పదినోత్సవ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మహాసంకల్ప సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారన్న విషయమై రాజకీయ, మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందని వార్తలు వెలువబడిన నేపథ్యంలో వీటిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారని అటు ప్రజల్లోనూ ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ సభలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన సూటిగా స్పందిస్తారా? ఆడియో టేపుల అంశంపై బాబు మాట్లాడుతారా? ఈ వ్యవహారంలో తనకు సంబంధం ఉందని చెబుతారా? సంబంధం లేదని చెబుతారా? లేక ఆడియోలో మాటలు తనవి కావని చెబుతారా? లై డిటెక్టర్ టెస్టుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను చంద్రబాబు స్వీకరిస్తారా? అనే ప్రశ్నలకు మహాసంకల్ప సభలో సమాధానం వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కస్డడీ పిటిషన్పై బుధవారం కోర్టు నిర్ణయం వెలువబడనుంది. అయితే రేవంత్ కస్టడి బుధవారం ముగియనుండటంతో రేవంత్ కస్టడీ విషయంలో మరో రెండు రోజులు పొడిగింపునకు ఏసీబీ కోర్టును కోరనున్నట్టు సమాచారం. కోర్టు నిర్ణయం తర్వాతే చంద్రబాబుకు నోటీసులు అందుతాయనే విశ్వసనీయ వర్గాల సమాచారం.