తిరుమల: శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16 వరకు జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం తనిఖీ చేశారు. ఆలయంలో జరుగుతున్న యాగ గుండాల ఏర్పాటు పనులను పరిశీలించారు. యాగశాల వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కోసం జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఆరు రోజుల్లో భక్తులకు కల్పించాల్సిన దర్శనం, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించినట్టు చెప్పారు.
యాగశాలలో వైదిక కార్యక్రమాల నిర్వహణ వల్ల దర్శన సమయం తక్కువగా ఉంటుందని, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామ న్నారు. ఆగస్టు 17 నుంచి యథావిధిగా భక్తులు పూర్తి సమయం స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. ఇక్కడి అన్నమయ్య భవనంలో ఆలయ ప్రధానార్చ కులు, పలు విభాగాల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం జేఈవో మాట్లాడుతూ ఆగస్టు 11న అంకురార్పణతో అష్టబంధన బాలాల య మహాసంప్రోక్షణ ప్రారంభమవుతుందన్నారు.
ఈ ఆరు రోజుల్లో ఎలాంటి సేవా టికెట్లు, ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. భక్తులను ఆయా రోజుల్లో సామర్థ్యానికి అనుగుణంగా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తామన్నా రు. ఆగస్టు 11న మొదటిరోజు దర్శనానికి సంబంధించి ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటలకు భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపారు. తర్వాత రోజుల్లో నిర్దేశించిన సమయానికి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment