కడప : టీడీపీ చేపట్టిన నవనిర్మాణ దీక్ష ముగింపు సభను మహాసంకల్పయాత్ర పేరిట బుధవారం సాయంత్రం కడప నగరంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కడప నగరాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. ఐదు వేల మంది పోలీసులు మోహరించారు. నగరంలో అడుగడుగునా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అలాగే నగరంలో ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు నారా లోకేశ్ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి కడపలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేసి గురువారం ఉదయం విజయవాడ వెళతారు.