'నాన్న ఆరోగ్యం భాగానే ఉంది' | Mithun went to hospital for routine check-up, says son | Sakshi
Sakshi News home page

'నాన్న ఆరోగ్యం భాగానే ఉంది'

Published Mon, May 18 2015 8:03 PM | Last Updated on Tue, May 28 2019 10:05 AM

'నాన్న ఆరోగ్యం భాగానే ఉంది' - Sakshi

'నాన్న ఆరోగ్యం భాగానే ఉంది'

ముంబై: బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి రొటీన్ చెక్ అప్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లాడని ఆయన కుమారుడు మహాక్షయ్ చెప్పారు. వాంతులు, జ్వరంతో ఆదివారం ఆస్పత్రిలో చేరినట్టు వచ్చిన వార్తలని ఖండిస్తూ అవన్ని అవాస్తవాలని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉండి ఇంట్లోనే ఉన్నాడని మహాక్షయ్ తెలిపారు.

కోట్లాది శారదా చిట్ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్కతాలో మిథున్ చక్రవర్తిని  ప్రశ్నించారు. శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి ఇదివరకే చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement