
రామనామం.. మహాయోగం
భద్రాద్రి మిథిలాస్టేడియంలోని మహాయజ్ఞ వేదిక రామనామస్మరణతో మార్మోగుతోంది. కొండకొప్పాక శ్రీ అష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకులు రఘునాథాచార్యులు నిర్వహిస్తున్న ఈ యాగంలో భాగంగా శనివారం శ్రీ రామ దివ్యమంత్రాన్ని 108 సార్లు జపించారు. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యమ్ రామనామ వరాననే’ అని వేదపండితులు మంత్రోచ్ఛారణ గావిస్తూ హోమగుండం వద్ద పూజలు నిర్వహించారు. - భద్రాచలం