
లోకకల్యాణార్థం మహాయజ్ఞం
సలకంచెరువు (శింగనమల) : లోక కళ్యాణార్థం ఇక్కడ మహాయజ్ఞం, కలశ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పర్మ సమస్థానమ్ పీఠాధిపతి యోగి మునేశ్వరి ఉద్బోధించారు. మండలంలోని సలకంచెరువు గ్రామ శివాలయంలో బుధవారం పర్మపిత శ్రీవెంకటరమణాచారి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పర్మపిత గురుదేవులు ఐదో ఆరాధన పురస్కరించుకుని 109 మంది జంటలతో కలశ పూజ, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పర్మ పీఠాధిపతి యోగి మునేశ్వరి సమక్షంలో హోమాలు, కలశ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 109 మంది జంటలతో కలశపూజ, హోమం చేయించారు. వీటివల్ల సకల శుభకార్యాలు, ఈప్రాంతం సుభిక్షంగా కావడం కోసం పూజలు చేపట్టినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్టు వైస్ చైర్మన్ ఆశోక్‌కుమార్, కార్యదర్శి రామాంజనేయాచారి, మల్లికార్జున, నాగభూషణం, మణిజ్ఞానశ్రీ దేవాలయం పూజారి శ్వర్థనారాయణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.