ఆ పండుటాకుకొచ్చింది.. 111వ వసంతం | 111 years old women | Sakshi
Sakshi News home page

ఆ పండుటాకుకొచ్చింది.. 111వ వసంతం

Published Fri, Jan 13 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

ఆ పండుటాకుకొచ్చింది.. 111వ వసంతం

ఆ పండుటాకుకొచ్చింది.. 111వ వసంతం

కొత్తపేట : 
సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న ఓ పండు వృద్ధురాలికి ఆమె తరతరాల వారసులు శుక్రవారం 110వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవతాళ్ళపాలెంకు చెందిన మాకా మంగమ్మ 1907 జనవరి 15న జన్మించారని, ఈ నెల 15న 111వ ఏట అడుగు పెడతారని వారసులు తెలిపారు. మంగమ్మకు చిల్లా ముసలమ్మ, ఏలూరి లక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన ముసలమ్మ వయసు 85 ఏళ్లకు పైబడింది. మంగమ్మ చాలాకాలంగా కొత్తపేట మండలం పలివెల శివారు వీరభద్రచౌదరిపురంలోని ముసలమ్మ వద్దే ఉంటున్నారు. ఆమె వారసులు 42 మందిలో అనేకులు ఉపాధి, ఉద్యోగాల పేరిట వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ వారు చౌదరిపురం వచ్చి మంగమ్మ బాగోగులు చూసి, తమ వద్దకు తీసుకువెళ్తుంటారు.110వ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు వారంతా వచ్చి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసారు.ఆమెతో కేక్‌ కట్‌ చేయించారు. ఆమెతో కలిసి అందరూ భోజనం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement