- జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన కొత్తపేట డిగ్రీ కళాశాల ఎ¯ŒSఎస్‌ఎస్ యూనిట్
- రాష్ట్ర స్థాయి ఉత్తమ పీఓగా అరుణ్‌కుమార్‌కు అవార్డు
- కేరళలో జాతీయ సమైక్యతా శిబిరానికి పయనం
- న్యూఢిల్లీలో రిపబ్లిక్ పెరేడ్‌కు, రాష్ట్రపతి అవార్డుకు వలంటీర్ ఎంపిక
ఉత్తమ సేవలతో..
Published Fri, Dec 23 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
కొత్తపేట :
స్థానిక విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎ¯ŒSఎస్‌ఎస్) యూనిట్ ఉత్తమ సేవా కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కళాశాల లైబ్రేరియన్, ఎ¯ŒSఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్ అరుణ్‌కుమార్ ఉన్నత లక్ష్యాలతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన కార్యక్రమాలకు ఉన్నత స్థాయిలో గుర్తింపు లభించింది. దానిలో భాగంగా ఈ నెల 25న కేరళ రాష్ట్రం అలెప్పీలో చిరుతల దగ్గర జాతీయ స్థాయిలో ఎ¯ŒSఎస్‌ఎస్ సమైక్యతా శిబిరానికి పీఓ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో 11 మంది విద్యార్థులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 24న ఎ¯ŒSఎస్‌ఎస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పీఓ అవార్డు స్వీకరించారు. అక్టోబర్ ఐదో తేదీ నుంచి 14 వరకూ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరిగిన జాతీయ స్థాయి అడ్వంచర్ క్యాంపులకు పది మంది యూనిట్ వలంటీర్లతో వెళ్లి అక్కడ ట్రెక్కింగ్, రోపింగ్, రివర్ క్రాసింగ్, జంగిల్ వాక్స్, పర్వతాలు ఎక్కడం వంటి వాటిలో శిక్షణ పొంది వాటిని అధిరోహించారు. అదే నెల 24 నుంచి 30 వరకూ తెలంగాణ రాష్ట్రం ఘట్‌కేసర్‌లో జరిగిన జాతీయ స్థాయి సమైక్యతా శిబిరానికి ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నారు. గత నెల రెండో తేదీ నుంచి 11 వరకూ గుజరాత్ రాష్ట్రం వడోదరలో జాతీయ స్థాయిలో జరిగిన ప్రీ రిపబ్లిక్ పేరేడ్‌కు ఇద్దరు విద్యార్థులు వెళ్లి శిక్షణ పొందారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ కర్నాటక రాష్ట్రం మైసూర్‌లో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరానికి నలుగురు వలంటీర్లు పాల్గొన్నారు. అంతేకాక పై అన్ని జాతీయ సమైక్యతా శిబిరాలకు ఏపీ తరఫున పీఓ అరుణ్‌కుమార్ టీమ్ లీడర్‌గా పాల్గొన్నారు.
న్యూడిల్లీ రిపబ్లిక్ పేరేడ్‌కు విద్యార్ధి ఎంపిక
వచ్చే నెల 26న న్యూఢిల్లీలో భారత రిపబ్లిక్ పేరేడ్ మార్చ్‌ఫాస్ట్ కార్యక్రమానికి ఎ¯ŒSఎస్‌ఎస్ విభాగంలో ఈ కళాశాల నుంచి బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థి కె సాయిరామకృష్ణ ఎంపికయ్యాడు. అతడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఎ¯ŒSఎస్‌ఎస్ వలంటీర్ అవార్డును తీసుకోనున్నాడు.
యూనిట్ పీఓ, వలంటీర్లకు అభినందనలు
చదువుతో పాటు ఎ¯ŒSఎస్‌ఎస్ యూనిట్ ద్వారా సామాజిక సేవ తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన పీఓ అరుణ్‌కుమార్, వలంటీర్లను కాలేజ్ ఎడ్యుకేష¯ŒS రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె గంగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ కె వెంకట్రావు, అధ్యాపకులు కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు.
Advertisement
Advertisement