దొరికిన మొసలి పిల్ల | crocodile kothapeta avidi | Sakshi
Sakshi News home page

దొరికిన మొసలి పిల్ల

Published Tue, Nov 8 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

దొరికిన మొసలి పిల్ల

దొరికిన మొసలి పిల్ల

గోదావరిలో వదిలిన అటవీశాఖ అధికారులు
కొత్తపేట : ఎట్టకేలకు మొసలి పిల్ల అటవీశాఖ అధికారుల వలకు చిక్కింది. మండలంలోని పలివెల–మాచవరం పంట కాలువలో అవిడి గ్రామ ముఖ ద్వారం సమీపంలోని డామ్‌ వద్ద శని, ఆదివారాల్లో  మొసలి పిల్ల సంచరించిన సంగతి తెలిసిందే. స్థానికులు, వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్‌ ఎ¯ŒS.శ్రీధర్‌ అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ రాజమండ్రి రేంజ్‌ ఆఫీసర్‌ రవి సిబ్బందితో మొసలి పిల్ల సంచరించిన ప్రదేశానికి చేరుకుని మొసళ్లను పట్టుకునే వలలతో గాలించి అర్ధరాత్రి ఒక మొసలి పిల్లను పట్టుకున్నారు. దానిని డ్రమ్‌లో బంధించి వానపల్లి శివారు నారాయణలంక వద్ద గౌతమీ గోదావరిలో వదిలినట్టు తహసీల్దార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement