Avidi
-
దొరికిన మొసలి పిల్ల
గోదావరిలో వదిలిన అటవీశాఖ అధికారులు కొత్తపేట : ఎట్టకేలకు మొసలి పిల్ల అటవీశాఖ అధికారుల వలకు చిక్కింది. మండలంలోని పలివెల–మాచవరం పంట కాలువలో అవిడి గ్రామ ముఖ ద్వారం సమీపంలోని డామ్ వద్ద శని, ఆదివారాల్లో మొసలి పిల్ల సంచరించిన సంగతి తెలిసిందే. స్థానికులు, వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఎ¯ŒS.శ్రీధర్ అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ రాజమండ్రి రేంజ్ ఆఫీసర్ రవి సిబ్బందితో మొసలి పిల్ల సంచరించిన ప్రదేశానికి చేరుకుని మొసళ్లను పట్టుకునే వలలతో గాలించి అర్ధరాత్రి ఒక మొసలి పిల్లను పట్టుకున్నారు. దానిని డ్రమ్‌లో బంధించి వానపల్లి శివారు నారాయణలంక వద్ద గౌతమీ గోదావరిలో వదిలినట్టు తహసీల్దార్ తెలిపారు. -
హెలెన్ తుపాను బాధితులకు జగన్ పరామర్శ
-
గోదావరి జిల్లాల్లో హెలెన్ తుపాను బాధితులకు జగన్ పరామర్శ
తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులను జగన్ రామర్శిస్తున్నారు. -
నేలకొరిగిన వరి పంటలను పరిశీలించిన జగన్
అమలాపురం: తుపాను, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈరోజు జగన్ పర్యటిస్తున్నారు. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులను జగన్ పరామర్శిస్తున్నారు. అవిడి, ఎన్ చిన్నపాలెం గ్రామాలలో నేలకొరిగిన వరి పంటలను పరిశీలించారు. తుపాను, అకాలవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కళ్యాణి జగన్‌ను కోరారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలు అమలాపురం వద్ద జగన్‌ను కలిశారు.