నేలకొరిగిన వరి పంటలను పరిశీలించిన జగన్
అమలాపురం: తుపాను, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈరోజు జగన్ పర్యటిస్తున్నారు. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులను జగన్ పరామర్శిస్తున్నారు. అవిడి, ఎన్ చిన్నపాలెం గ్రామాలలో నేలకొరిగిన వరి పంటలను పరిశీలించారు.
తుపాను, అకాలవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కళ్యాణి జగన్ను కోరారు.
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలు అమలాపురం వద్ద జగన్‌ను కలిశారు.