
ఇంటిప్స్
వాతావరణంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుంటే, దోమల బెడద కూడా పెరుగుతుంది. మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వంటివి కొందరికి సరిపడక అలెర్జీలు వస్తుంటాయి. అలాంటప్పుడు చీకటిపడే వేళ ఇంటి తలుపులన్నీ మూసేసి, ఆవుపేడతో చేసిన పిడకలకు నిప్పుపెట్టి, ఎండిన వేపాకులను వేసి పొగపెడితే చాలు. దోమల బెడద తీరుంది.
దోమలు కుడితే పిల్లలకు దద్దుర్లు వస్తుంటాయి. పిల్లలకు దోమకాటు బెడద తప్పాలంటే, వేపనూనె, పసుపు కలిపి ఒంటికి పూస్తే చాలు. దోమలు దూరంగా ఉంటాయి.