
సాక్షి, హైదరాబాద్: వేసవిలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఉదయం మండుటెండ, మధ్యాహ్నం వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు. బుధవారం నగర వాతావరణంలో ఈ వింత చోటుచేసుకుంది. పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతోన్న గ్రేటర్ ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులకు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
సాయంత్రం 4 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురిశాయి. గరిష్టంగా 39.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు సైతం సాధారణంకంటే 2 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణంలో ప్రస్తుతం చోటుచేసుకున్న మార్పులు అసాధారణమేమీ కాదని స్పష్టంచేసింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment