క్యాప్సూల్ లో దోమా...దేవుడా! | Mosquito found in multivitamin pill | Sakshi
Sakshi News home page

క్యాప్సూల్ లో దోమా...దేవుడా!

Published Fri, Jul 10 2015 10:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

క్యాప్సూల్ లో దోమా...దేవుడా!

క్యాప్సూల్ లో దోమా...దేవుడా!

ముంబై:  మొన్న మ్యాగీ ..నిన్న కెఎఫ్సీ ..తర్వాత గ్లూకాన్డీ లో పురుగులు.. చివరికి పసిపిల్లలకు పెట్టే సెరిలాక్లో కూడా పురుగులు. వాటికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తోడయ్యింది.  సాధారణంగా నీరసించిన శరీరానికి శక్తిని అందించేందుకు, మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోమని వైద్యులు చెబుతారు. మరి అలాంటి మాత్రలో ఈగలు, దోమలు కనిపిస్తే ఎలా ఉంటుంది. యాక్ తూ....అంటాం.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది ముంబైలోని ఓ మహిళకు.

ఈ మధ్యనే పాపకు జన్మనిచ్చిన ఆమెకు  శక్తి వచ్చేందుకు వైద్యులు కొన్ని మాత్రలు రాసిచ్చారు.  అలా ఆమె కొనుక్కున్న క్యాప్సూల్ ఒకదాంట్లో చచ్చిపోయిన దోమ కనిపించింది. దీంతో షాకవడం ఆమె వంతయ్యింది. అదనపు శక్తి మాట దేవుడెరుగు, అసలుకే మోసం వస్తే ఎలా అని.... తాను కొన్నమందుల్లోని క్యాప్సూల్లో చచ్చిపోయిన దోమను చూసి ఆశ్చర్యపోయానని బాధితురాలు వాపోయింది. దీనిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement