multivitamin pill
-
మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా?
ఇటీవల కాలంలో మల్టీవిటమిన్లు వాడకం ఎక్కువయ్యింది. కొందరూ వీటి వల్ల ఎలాంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడమని మరణాల ప్రమాదం తగ్గుతుందన్న నమ్మకంతో తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మరణా ప్రమాదం తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజు వీటిని వినియోగించే వారికే మరింత ప్రమాదం ఉందంటూ పలు ఆసక్తికర షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..డైలీ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించేలా సహాయపడదని అధ్యయనంలో తేలింది. ఇలా వాడటం వల్ల మరణ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈవిధంగా డైలీ మల్టీవిటమిన్లు వినియోగించేవారిలో రాబోయే దశాబ్దాలలో వారి మరణ ప్రమాదాన్ని తగ్గించాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు నాలుగు లక్షల మంది పెద్దల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధనలో మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకున్న వారికే మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. ఇలా సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తుల్లో మరణాల ప్రమాదం 4% పెరుగుతుందని అధ్యనం వెల్లడించింది. నిజానికి ఇప్పటి వరకు మల్టీవిటమిన్లు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, హాని గురించి తగిన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలికి వ్యాధి సంబంధిత మరణాలకు మల్టీవిటమిన్ల వినియోగంకు ఎంత వరకు లింక్ అప్ అయ్యి ఉంటుందనే దిశగా అధ్యయనాలు చేసినట్లు పరిశోధకులు వివరించారు. ఈ క్రమంలో డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్ఫీల్డ్, అతడి సహచరులు యూఎస్ ప్రజలకు సంబంధించి మూడు ప్రదాన ఆరోగ్య అధ్యయనాల డేటాను విశ్లేషించారు. ఈ పరిశోధనలో దాదాపు 3 లక్షలకు పైగా ప్రజల ఆరోగ్య వంతమైన డేటాను రికార్డు చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారి సగటు వయసు 60 ఏళ్లు మాత్రమే. కానీ ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడూ వాటి వినియోగం ఎక్కువగా ఉందని, ఇలా వినియోగించడం వల్ల మంచిది కాదని పరిశోధన చెబుతోంది. అయితే నిర్థిష్ట సమయంలో ఇవి మంచి ఫలితాలు కూడా ఇస్తాయని అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. నావికులు విటమిన్ సీ సప్లిమెంట్స్ ద్వారా రక్షించబడ్డారు. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఈ, జింక్ వంటి వాటితో వయసు సంబంధిత మచ్చల క్షీణత నెమ్మదిస్తుందని చెప్పారు. ఇక్కడ మల్లీవిటమిన్లు మనిషిని ఎక్కువ కాలం బతికేలా చేయలేవని, మరణాల ప్రమాదం రాకుండా చేయలేదని వెల్లడించారు. దాని బదులు ఆ విటమిన్లన్నీ పుష్కలంగా లభించేలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను పరిమితం చేస్తూ..సూక్ష్మపోషకాలు, మాక్రోన్యూట్రియెంట్లు, ఫైబర్లు ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని అన్నారు. కేవలం విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉండదని, అవి మరణా ప్రమాదాన్ని తగ్గించవని అన్నారు. వాటన్నింటిని ఆహారం నుంచి పొందేలా కష్టపడితే వ్యాధుల బారినపడరని, ఎక్కువకాలం జీవించగలుగుతారని అన్నారు పరిశోధకులు. (చదవండి: నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.) -
మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే
న్యూఢిల్లీ : సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్, మినరల్స్ వంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని అనాల్స్ ఆఫ్ ఇంటర్నర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం స్పష్టం చేసింది. కాల్షియం, విటమిన్ డీతో కూడిన సప్లిమెంట్లు స్ర్టోక్ ముప్పును పెంచుతాయని ఈ అథ్యయనం బాంబు పేల్చింది. కాల్షియం, విటమిన్ డీలతో నేరుగా ఎదురయ్యే అనారోగ్య ముప్పులు, ప్రయోజనాలపై ఇంతవరకూ సాధికారిక ఆధారాలు ఏమీ లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రభావాన్ని నిరోధించడంలో మల్టీవిటమన్లు, మినరల్స్, ఇతర హెల్త్ సప్లిమెంట్లు నిర్థిష్టంగా దోహదపడ్డాయనేందుకు తమకు ఎలాంటి కొలమానాలు లభించలేదని వెల్లడైందని అథ్యయన రచయిత వెస్ట్ వర్జీనియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సఫీ యూ ఖాన్ పేర్కొన్నారు. -
మల్టీవిటమిన్లను నమ్ముకుంటే..
లండన్ : రోజూ మల్టీవిటమిన్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలూ దరిచేరవనే ధీమా పనికిరాదని తాజా అధ్యయనం హెచ్చరించింది. మల్టీవిటమిన్స్‌తో గుండె జబ్బులు, స్ర్టోక్‌లు నివారించవచ్చనే ప్రచారంపై దృష్టి సారించిన ఈ అథ్యయనం ఇవన్నీ అపోహలేనని తేల్చింది. బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్సిటీ పరిశోధకులు 12 ఏళ్ల పాటు 2000 మందిని పరిశీలించిన అనంతరం సమర్పించిన పత్రంలో సప్లిమెంట్స్ వాడకం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని నిర్ధారణకు వచ్చారు. మల్టీవిటమిన్లు గుండెకు మేలు చేయకపోగా, వీటి వాడకంతో తమ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ధీమాతో ప్రజలు పొగతాగడం, జంక్ ఫుడ్ తినడాన్ని కొనసాగిస్తారని అథ్యయన రచయిత డాక్టర్ జూన్సెక్ కిమ్ హెచ్చరించారు.మల్టీవిటమిన్స్, మినరల్ సప్లిమెంట్లు కార్డియోవాస్కులర్ జబ్బులను నివారించలేవని ఆయన స్పష్టం చేశారు. తమ అథ్యయన వివరాలతో మల్టీవిటమిన్లు, మినరల్ సప్లిమెంట్లపై అపోహలు తొలిగి, గుండె జబ్బుల నివారణకు మెరుగైన పద్ధతులకు ప్రజలు మొగ్గుచూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గుండె జబ్బులకు దూరంగా ఉంటాలంటే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయడంతో పాటు, ధూమపానానికి స్వస్తిపలకడం వంటి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు. ఈ అథ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమైంది. -
క్యాప్సూల్ లో దోమా...దేవుడా!
ముంబై: మొన్న మ్యాగీ ..నిన్న కెఎఫ్సీ ..తర్వాత గ్లూకాన్డీ లో పురుగులు.. చివరికి పసిపిల్లలకు పెట్టే సెరిలాక్లో కూడా పురుగులు. వాటికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తోడయ్యింది. సాధారణంగా నీరసించిన శరీరానికి శక్తిని అందించేందుకు, మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోమని వైద్యులు చెబుతారు. మరి అలాంటి మాత్రలో ఈగలు, దోమలు కనిపిస్తే ఎలా ఉంటుంది. యాక్ తూ....అంటాం.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది ముంబైలోని ఓ మహిళకు. ఈ మధ్యనే పాపకు జన్మనిచ్చిన ఆమెకు శక్తి వచ్చేందుకు వైద్యులు కొన్ని మాత్రలు రాసిచ్చారు. అలా ఆమె కొనుక్కున్న క్యాప్సూల్ ఒకదాంట్లో చచ్చిపోయిన దోమ కనిపించింది. దీంతో షాకవడం ఆమె వంతయ్యింది. అదనపు శక్తి మాట దేవుడెరుగు, అసలుకే మోసం వస్తే ఎలా అని.... తాను కొన్నమందుల్లోని క్యాప్సూల్‌లో చచ్చిపోయిన దోమను చూసి ఆశ్చర్యపోయానని బాధితురాలు వాపోయింది. దీనిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.