ఇటీవల కాలంలో మల్టీవిటమిన్లు వాడకం ఎక్కువయ్యింది. కొందరూ వీటి వల్ల ఎలాంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడమని మరణాల ప్రమాదం తగ్గుతుందన్న నమ్మకంతో తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మరణా ప్రమాదం తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజు వీటిని వినియోగించే వారికే మరింత ప్రమాదం ఉందంటూ పలు ఆసక్తికర షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
డైలీ మల్టీవిటమిన్‌లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించేలా సహాయపడదని అధ్యయనంలో తేలింది. ఇలా వాడటం వల్ల మరణ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈవిధంగా డైలీ మల్టీవిటమిన్లు వినియోగించేవారిలో రాబోయే దశాబ్దాలలో వారి మరణ ప్రమాదాన్ని తగ్గించాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు నాలుగు లక్షల మంది పెద్దల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధనలో మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకున్న వారికే మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనాన్ని నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. ఇలా సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తుల్లో మరణాల ప్రమాదం 4% పెరుగుతుందని అధ్యనం వెల్లడించింది. నిజానికి ఇప్పటి వరకు మల్టీవిటమిన్లు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, హాని గురించి తగిన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలికి వ్యాధి సంబంధిత మరణాలకు మల్టీవిటమిన్‌ల వినియోగంకు ఎంత వరకు లింక్ అప్ అయ్యి ఉంటుందనే దిశగా అధ్యయనాలు చేసినట్లు పరిశోధకులు వివరించారు. ఈ క్రమంలో డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్‌ఫీల్డ్, అతడి సహచరులు యూఎస్ ప్రజలకు సంబంధించి మూడు ప్రదాన ఆరోగ్య అధ్యయనాల డేటాను విశ్లేషించారు.
ఈ పరిశోధనలో దాదాపు 3 లక్షలకు పైగా ప్రజల ఆరోగ్య వంతమైన డేటాను రికార్డు చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారి సగటు వయసు 60 ఏళ్లు మాత్రమే. కానీ ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడూ వాటి వినియోగం ఎక్కువగా ఉందని, ఇలా వినియోగించడం వల్ల మంచిది కాదని పరిశోధన చెబుతోంది. అయితే నిర్థిష్ట సమయంలో ఇవి మంచి ఫలితాలు కూడా ఇస్తాయని అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. నావికులు విటమిన్ సీ సప్లిమెంట్స్ ద్వారా రక్షించబడ్డారు. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఈ, జింక్ వంటి వాటితో వయసు సంబంధిత మచ్చల క్షీణత నెమ్మదిస్తుందని చెప్పారు.
ఇక్కడ మల్లీవిటమిన్లు మనిషిని ఎక్కువ కాలం బతికేలా చేయలేవని, మరణాల ప్రమాదం రాకుండా చేయలేదని వెల్లడించారు. దాని బదులు ఆ విటమిన్‌లన్నీ పుష్కలంగా లభించేలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను పరిమితం చేస్తూ..సూక్ష్మపోషకాలు, మాక్రోన్యూట్రియెంట్లు, ఫైబర్లు ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని అన్నారు. కేవలం విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉండదని, అవి మరణా ప్రమాదాన్ని తగ్గించవని అన్నారు. వాటన్నింటిని ఆహారం నుంచి పొందేలా కష్టపడితే వ్యాధుల బారినపడరని, ఎక్కువకాలం జీవించగలుగుతారని అన్నారు పరిశోధకులు.
(చదవండి: నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.)
Comments
Please login to add a commentAdd a comment