Longer
-
మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా?
ఇటీవల కాలంలో మల్టీవిటమిన్లు వాడకం ఎక్కువయ్యింది. కొందరూ వీటి వల్ల ఎలాంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడమని మరణాల ప్రమాదం తగ్గుతుందన్న నమ్మకంతో తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మరణా ప్రమాదం తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజు వీటిని వినియోగించే వారికే మరింత ప్రమాదం ఉందంటూ పలు ఆసక్తికర షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..డైలీ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించేలా సహాయపడదని అధ్యయనంలో తేలింది. ఇలా వాడటం వల్ల మరణ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈవిధంగా డైలీ మల్టీవిటమిన్లు వినియోగించేవారిలో రాబోయే దశాబ్దాలలో వారి మరణ ప్రమాదాన్ని తగ్గించాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు నాలుగు లక్షల మంది పెద్దల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధనలో మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకున్న వారికే మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. ఇలా సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తుల్లో మరణాల ప్రమాదం 4% పెరుగుతుందని అధ్యనం వెల్లడించింది. నిజానికి ఇప్పటి వరకు మల్టీవిటమిన్లు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, హాని గురించి తగిన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలికి వ్యాధి సంబంధిత మరణాలకు మల్టీవిటమిన్ల వినియోగంకు ఎంత వరకు లింక్ అప్ అయ్యి ఉంటుందనే దిశగా అధ్యయనాలు చేసినట్లు పరిశోధకులు వివరించారు. ఈ క్రమంలో డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్ఫీల్డ్, అతడి సహచరులు యూఎస్ ప్రజలకు సంబంధించి మూడు ప్రదాన ఆరోగ్య అధ్యయనాల డేటాను విశ్లేషించారు. ఈ పరిశోధనలో దాదాపు 3 లక్షలకు పైగా ప్రజల ఆరోగ్య వంతమైన డేటాను రికార్డు చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారి సగటు వయసు 60 ఏళ్లు మాత్రమే. కానీ ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడూ వాటి వినియోగం ఎక్కువగా ఉందని, ఇలా వినియోగించడం వల్ల మంచిది కాదని పరిశోధన చెబుతోంది. అయితే నిర్థిష్ట సమయంలో ఇవి మంచి ఫలితాలు కూడా ఇస్తాయని అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. నావికులు విటమిన్ సీ సప్లిమెంట్స్ ద్వారా రక్షించబడ్డారు. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఈ, జింక్ వంటి వాటితో వయసు సంబంధిత మచ్చల క్షీణత నెమ్మదిస్తుందని చెప్పారు. ఇక్కడ మల్లీవిటమిన్లు మనిషిని ఎక్కువ కాలం బతికేలా చేయలేవని, మరణాల ప్రమాదం రాకుండా చేయలేదని వెల్లడించారు. దాని బదులు ఆ విటమిన్లన్నీ పుష్కలంగా లభించేలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను పరిమితం చేస్తూ..సూక్ష్మపోషకాలు, మాక్రోన్యూట్రియెంట్లు, ఫైబర్లు ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని అన్నారు. కేవలం విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉండదని, అవి మరణా ప్రమాదాన్ని తగ్గించవని అన్నారు. వాటన్నింటిని ఆహారం నుంచి పొందేలా కష్టపడితే వ్యాధుల బారినపడరని, ఎక్కువకాలం జీవించగలుగుతారని అన్నారు పరిశోధకులు. (చదవండి: నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.) -
...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు: మరో సీఈవో..
దేశంలో ఉద్యోగులు, యువత ఎంత సేపు కష్టపడాలి.. ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బాటలోకి మరో సీఈవో వచ్చి చేరారు. ఎక్కువ గంటలు పనిచేయడానికి ఏ మాత్రం సంకోచించకూడదని, జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన.. ఇంకా ఏమన్నారన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ ‘వేఫెయిర్’ సీఈవో నీరజ్ షా (Wayfair CEO Niraj Shah).. ఎక్కువ పని గంటలు పనిచేయాలని తమ కంపెనీ ఉద్యోగులకు సూచించారు. ఎవరైనా సోమరితనంతో విజయం సాధించినట్లు చరిత్రలో లేదని ఉద్బోధించారు. విజయం సాధించాలంటే కష్టపడాల్సిందేనంటూ ఈ భారతీయ-అమెరికన్ బిజినెస్‌మన్ తమ ఉద్యోగులకు పంపిన ఒక నోట్లో పేర్కొన్నట్లుగా సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనంలో నివేదించింది. కంపెనీ డబ్బును మీదిగా భావించండి.. "ఎక్కువ గంటలు పని చేయడానికి, మరింత బాధ్యతగా ఉండటానికి, పనిని, జీవితాన్ని మిళితం చేయడానికి సంకోసించాల్సిన, సిగ్గుపడాల్సిన పనిలేదు. సోమరితనంతో ఎవరూ విజయం పొందినట్లు చరిత్రలో లేదు" అని నీరజ్షా ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ ఇటీవలి విజయాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ నెల ప్రారంభంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. కంపెనీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయినీ తమదిగా భావించి మరింత బాధ్యతగా పనిచేయాలని ఉద్యోగులను కోరారు. నారాయణమూర్తి బాటలో.. యువత ఎక్కువ పని గంటలు పనిచేయాలనే భావనను మొదటి సారిగా వెలుబుచ్చిన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. రెండు నెలల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఆ తర్వాత చర్చ విస్తృతమైంది. విభిన్న వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమందికి ఆయన భావనను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు. -
బ్రెయిన్ సైజ్‌కు దానికి సంబంధం!
న్యూయార్క్: బ్రెయిన్ సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎంతపెద్దగా(ఎంత ఎక్కువ సమయం) ఆవులింత వస్తుందో తెలుసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు సుమారు 29 రకాల క్షీరదాల ఆవులింతలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్థారించారు. జీవుల్లో ఎంత అంతపెద్ద బ్రెయిన్ ఉంటే అంత ఎక్కువ సమయం ఆవులింత వస్తుందని వారు తెలిపారు. మెదడు బయటిపొరలోని నాడీకణాల సంఖ్య, బ్రెయిన్ సైజ్ ఈ రెండూ ఆవులింత పరిమాణాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉదాహారణకు గొరిల్లాలు, గుర్రాలు, ఆఫ్రికన్ ఏనుగుల ఆవులింతల పరిమాణం చిన్నగా ఉంటుందని, దీనికి కారణం శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మన మెదడు పరిమాణం కంటే వాటి మొదడు పరిమాణం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోవడమే అని వెల్లడించారు. ఆవులింత ఎంతపెద్దగా వస్తుందనే విషయం శరీరం ఎంతపెద్దగా ఉందనేదానిపై కాకుండా మెదడు ఎంతపెద్దగా ఉందనే విషయంపై ఆదారపడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆండ్రూ గాల్లప్ తెలిపారు. -
ఆనందం ఆయుష్షునివ్వదు!
నవ్వడం భోగం నవ్వలేకపోవడం రోగం.. ఇంకా చెప్పాలంటే సంతోషం సగం బలం. ఇలా ఆనందంగా, హాయిగా ఉంటే అనారోగ్యం దరిచేరదని చాలామంది భావిస్తారు. ఆనందం ఆరోగ్యంపై అద్భుత ప్రభావం చూపుతుందని, మానసికోల్లాసాన్ని కలిగించి, మనసుకు ప్రశాంతతనిస్తుందని నమ్మేవారంతా ఏకంగా నవ్వుల దినోత్సవాలను జరపడమేకాక, లాఫింగ్ క్లబ్బుల వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే అవన్నీ వట్టి నమ్మకాలేనంటున్నారు లండన్ అధ్యయనకారులు. అనారోగ్యం, ప్రాణభయం వంటివి అసంతృప్తిని కలిగించి ఆయుక్షీణం కలిగిస్తాయేమో కానీ, ఆనందం వల్ల ఆరోగ్యం చేకూరే అవకాశం లేదంటున్నారు. లండన్‌లో నిర్వహించిన మిలియన్ ఉమెన్ స్టడీలో మహిళలను పరిశోధకుల బృదం.. ఒత్తిడి, సంతోషం, అసంతృప్తి, నియంత్రణ, విశ్రాంతి వంటి వాటి ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో తెలుపాలని ఓ ప్రశ్నావళిని అందించారు. సమాధానం ఇచ్చినవారిలో ఆరుగురిలో ఐదుగురు సాధారణంగా సంతోషానికే తమ ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే అసంతృప్తితో ఉన్నవారిలో ధూమపానం, బద్ధకం, భాగస్వామితో సరిగా లేకపోవడం వంటి అలవాట్లు ఉండాలని, వారంతా సంతోషంగా, ఆరోగ్యంగానే ఉన్నారని అధ్యయనకారులు చెప్తున్నారు. మరోవైపు అప్పటికే అనారోగ్యంతో ఉన్న మహిళలు మాత్రం విచారంగానూ, ఒత్తిడితోనూ, నియంత్రణాశక్తిని కోల్పోయి, విశ్రాంతి లేకుండా ఉన్నట్లు ఇలా పలు భావాలను ప్రకటించినట్లు అధ్యయనంలో తేలింది. పది సంవత్సరాల కాలంలో మొత్తం ఏడు లక్షలమంది మహిళలను పరిశీలించగా సగటున 59 సంవత్సరాల వయసు పైబడినవారు సుమారుగా 30 వేలమంది మరణించినట్లుగా అధ్యయనాల ద్వారా వెల్లడైంది. అలాగే వారి జీవన శైలి, అలవాట్ల ఆధారంగా చూసినపుడు మరణాల సంఖ్య సంతోషంగా ఉన్నవారికి, విచారంగా ఉన్నవారికీ మధ్య పెద్దగా తేడా లేనట్లు తేలింది. అందుకే ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ బెట్టె లియు.. అనారోగ్యం వల్ల అసంతృప్తి చోటుచేసుకుంటుందే తప్ప... అసంతృప్తి వల్ల అనారోగ్యం దరిచేరదంటున్నారు. అసంతృప్తి, ఒత్తిడి వంటివి మృత్యువుపై ప్రత్యక్ష ప్రభావం చూపినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని ఆయన అంటున్నారు.