పంజా
విజృంభిస్తున్న దోమ..
ప్రబలుతున్న డెంగీ వ్యాధి
- పెరుగుతున్న రోగుల సంఖ్య
- అధికారికంగా 15 కేసుల నమోదు
- సంగారెడ్డిలో ఒకరు డెంగీతో మృతి
- చేతులెత్తేసిన ప్రభుత్వాస్పత్రులు
- రోగ నిర్థారణ, చికిత్స కరువు
సాక్షి, సంగారెడ్డిడెంగీతో సంగారెడ్డి పట్టణంలో ఒకరు మృతి చెందగా, పలువురు జిల్లా, హైదరాబాద్‌లలోని ప్రభు త్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వ్యాధి నిర్ధారణ పరికరాలేవి?
డెంగీని నిర్థారించేందుకు అవసరమైన పరికరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా
మెతుకుసీమను దోమ వణికిస్తోంది. దీని కాటుకు ఇప్పటికి 15 మంది డెంగీ బారిన పడ్డారు. ఇది అధికారిక లెక్క. అనధికారికంగా, సమీపంలోని రాజధానికి వెళ్లి పలువురు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. వర్షాకాలంలో పారిశుద్ధ్యం లోపించి దోమలు పెరుగుతుండటంతో వ్యాది బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయని చెబుతున్నా.. ఈ సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది.
ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు. దీనికితోడు డెంగీ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు చికిత్స అందించకుండా హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. స్థోమత ఉన్న వారు హైదరాబాద్ వెళ్తుండగా, పేదలు స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. డెంగీని కచ్చితంగా నిర్థారించాలంటే ఎలిజా టెస్టు చేయాలి.
ఈ టెస్టు నిర్వహించేందుకు ఉపయోగించే మిషనరీ వ్యయం రూ.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది ప్రస్తుతం సంగారెడ్డి సమీపంలోని ఎంఎ¯ŒSఆర్ వైద్య కళాశాలలోనే అందుబాటులో ఉంది. దీంతో అక్కడికే ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్‌సీ అధికారులు డెంగీ వ్యాధి నిర్థారణ కోసం శాంపిల్స్ పంపుతున్నారు. ఇలా పంపిన శాంపిల్స్‌లో 15 కేసులు డెంగీ ఉన్నట్లు నిర్థారణ వచ్చినట్లు మలేరియా అధికారి నాగయ్య తెలిపారు.
పారిశుద్ధ్య లోపమే శాపం
దోమల కారణంగా డెంగీ సోకుతుంది. పారిశుద్ధ్యం లోపించటం, మురికినీరు ఒకచోట నిలిచిపోయిన ప్రాంతాల్లో డెంగీ కారక దోమలు పెరుగుతాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినందున గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత లోపించటంతో దోమల బెడద పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సరిగ్గా సాగటంలేదు. మున్సిపాలిటీల్లో సైతం ఫాగింగ్ చేయకపోవటం, మురికికాల్వలు శుభ్రం చేయకపోవటంతో డెంగీ పంజా విసురుతోంది. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
సంగారెడ్డి పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో డెంగీకి గురై ఒకరు మృతి చెందారు. ఇటీవల నర్సాపూర్ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ముగ్గురు విద్యార్థులు డెంగీ బారిన పడ్డారు. టె¯ŒS్త చదివే బిందు, నమ్రతతో పాటు 6వ తరగతి చదివే నితి¯ŒSకుమార్ గత నెల 25 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు డెంగీకి చికిత్స పొందారు. బిందు గాంధీ ఆసుపత్రిలో, నమ్రత, నితి¯ŒSకుమార్ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం తీసుకున్నారు.
అక్కడే 10–15 మంది రోగులు..
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ నుంచే 10–15 మంది ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఆ మండలంలోని వివిధ గ్రామాల నుంచి సైతం డెంగీ రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే డెంగీ నిర్ధారణ సౌలభ్యం ప్రభుత్వాసుపత్రుల్లో లేకపోవడం వల్ల పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దోమల నివారణకు ఫాగింగ్ యంత్రంతో మందును పిచికారి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా అటువంటిదేదీ కనబడడం లేదని ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు సైతం డెంగీ కచ్చితంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరా>లు లేనప్పటికీ తమ ల్యాబ్‌్సలో అందుబాటులో ఉన్న పరికరాలతో సీబీపీ లాంటి టెస్టులు చేసి డెంగీ సోకినట్లు రోగులకు చెప్పి వారిని ఆసుపత్రుల్లో చేర్చుకుని డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. డెంగీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్యం లోపించి దోమలు పెరగటం వల్ల డెంగీ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ప్రజలు ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా చూసుకోవాలి. దోమల తెరలు వాడాలి. డెంగీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు డెంగీ కేసులపై అధ్యయనం జరుపుతున్నాం.
– నాగయ్య, జిల్లా మలేరియా అధికారి