Metukusima
-
పంజా
విజృంభిస్తున్న దోమ.. ప్రబలుతున్న డెంగీ వ్యాధి పెరుగుతున్న రోగుల సంఖ్య అధికారికంగా 15 కేసుల నమోదు సంగారెడ్డిలో ఒకరు డెంగీతో మృతి చేతులెత్తేసిన ప్రభుత్వాస్పత్రులు రోగ నిర్థారణ, చికిత్స కరువు సాక్షి, సంగారెడ్డిడెంగీతో సంగారెడ్డి పట్టణంలో ఒకరు మృతి చెందగా, పలువురు జిల్లా, హైదరాబాద్‌లలోని ప్రభు త్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరికరాలేవి? డెంగీని నిర్థారించేందుకు అవసరమైన పరికరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా మెతుకుసీమను దోమ వణికిస్తోంది. దీని కాటుకు ఇప్పటికి 15 మంది డెంగీ బారిన పడ్డారు. ఇది అధికారిక లెక్క. అనధికారికంగా, సమీపంలోని రాజధానికి వెళ్లి పలువురు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. వర్షాకాలంలో పారిశుద్ధ్యం లోపించి దోమలు పెరుగుతుండటంతో వ్యాది బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయని చెబుతున్నా.. ఈ సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు. దీనికితోడు డెంగీ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు చికిత్స అందించకుండా హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. స్థోమత ఉన్న వారు హైదరాబాద్ వెళ్తుండగా, పేదలు స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. డెంగీని కచ్చితంగా నిర్థారించాలంటే ఎలిజా టెస్టు చేయాలి. ఈ టెస్టు నిర్వహించేందుకు ఉపయోగించే మిషనరీ వ్యయం రూ.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది ప్రస్తుతం సంగారెడ్డి సమీపంలోని ఎంఎ¯ŒSఆర్ వైద్య కళాశాలలోనే అందుబాటులో ఉంది. దీంతో అక్కడికే ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్సీ అధికారులు డెంగీ వ్యాధి నిర్థారణ కోసం శాంపిల్స్ పంపుతున్నారు. ఇలా పంపిన శాంపిల్స్‌లో 15 కేసులు డెంగీ ఉన్నట్లు నిర్థారణ వచ్చినట్లు మలేరియా అధికారి నాగయ్య తెలిపారు. పారిశుద్ధ్య లోపమే శాపం దోమల కారణంగా డెంగీ సోకుతుంది. పారిశుద్ధ్యం లోపించటం, మురికినీరు ఒకచోట నిలిచిపోయిన ప్రాంతాల్లో డెంగీ కారక దోమలు పెరుగుతాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినందున గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత లోపించటంతో దోమల బెడద పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సరిగ్గా సాగటంలేదు. మున్సిపాలిటీల్లో సైతం ఫాగింగ్ చేయకపోవటం, మురికికాల్వలు శుభ్రం చేయకపోవటంతో డెంగీ పంజా విసురుతోంది. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డి పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో డెంగీకి గురై ఒకరు మృతి చెందారు. ఇటీవల నర్సాపూర్ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ముగ్గురు విద్యార్థులు డెంగీ బారిన పడ్డారు. టె¯ŒS్త చదివే బిందు, నమ్రతతో పాటు 6వ తరగతి చదివే నితి¯ŒSకుమార్ గత నెల 25 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు డెంగీకి చికిత్స పొందారు. బిందు గాంధీ ఆసుపత్రిలో, నమ్రత, నితి¯ŒSకుమార్ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం తీసుకున్నారు. అక్కడే 10–15 మంది రోగులు.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ నుంచే 10–15 మంది ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఆ మండలంలోని వివిధ గ్రామాల నుంచి సైతం డెంగీ రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే డెంగీ నిర్ధారణ సౌలభ్యం ప్రభుత్వాసుపత్రుల్లో లేకపోవడం వల్ల పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రంతో మందును పిచికారి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా అటువంటిదేదీ కనబడడం లేదని ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు సైతం డెంగీ కచ్చితంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరా>లు లేనప్పటికీ తమ ల్యాబ్‌్సలో అందుబాటులో ఉన్న పరికరాలతో సీబీపీ లాంటి టెస్టులు చేసి డెంగీ సోకినట్లు రోగులకు చెప్పి వారిని ఆసుపత్రుల్లో చేర్చుకుని డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. డెంగీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్యం లోపించి దోమలు పెరగటం వల్ల డెంగీ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ప్రజలు ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా చూసుకోవాలి. దోమల తెరలు వాడాలి. డెంగీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు డెంగీ కేసులపై అధ్యయనం జరుపుతున్నాం. – నాగయ్య, జిల్లా మలేరియా అధికారి -
వరి సాగుపై నీలి నీడలు
‘మెతుకు’ సీమలో భిన్నమైన పరిస్థితి గణనీయంగా పడిపోతున్న సాగు విస్తీర్ణం రెండేళ్లుగా మరింత దయనీయం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో... భూగర్భజలమట్టం పడిపోవటమే కారణం భారంగా మారి.. సాగుకు రైతన్న దూరం గజ్వేల్ఃవిస్తారమైన వరి సాగుతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించిన మెదక్ జిల్లాలో నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం పడిపోవటంతో బోరుబావుల ఆధారంగా సాగవుతున్న ‘వరి’ గణనీయంగా తగ్గుతున్నది. మరోవైపు రిజర్వాయర్లు, ఆనకట్టలు వెలవెలబోతుండగా...వాటి పరిధిలోని వేల ఎకరాల వరి పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. రెండేళ్లుగా మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ‘వరి’పై నీలినీడలు కమ్ముకోడంతో దాని స్థానంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కథనం... జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కరిస్తే..ఏటా 5.5లక్షల హెక్టార్ల పంటలు సాగులోకి వస్తుంటాయి. గత పదేళ్ల క్రితం వరకు ఇందులో ‘వరి’దే అగ్రస్థానం. మిగితా పంటలన్నీ 60శాతం మాత్రమే ఉండేవి. ఇదే క్రమంలో మెదక్ జిల్లా ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం గణనీయంగా పడిపోతున్నది. ఫలితంగా బోరుబావులు వట్టిపోయి...‘వరి’ సాగు ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఈసారి 82206 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ వరి ఇప్పటివరకు కేవలం సుమారుగా 10వేల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. సీజన్ ముగిసేవరకు మరో 20హెక్టార్లలోకి సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ భావిస్తున్నది. జూన్‌లో 125.6 మి.మీల వర్షపాతానికిగానూ 136.9మి.మీలు నమోదు కాగా...జూలై నెలలో ఇప్పటివరకు 183.6మి.మీల వర్షపాతానికి ఇప్పటివరకు 155.7మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుములు లాంటి ఆరుతడి పంటలు ఇప్పటివరకు 3లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. ‘వరి’ సాగు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. బోర్ల సాయంతో ఒకవేళ...వరి సాగు చేసినా..వర్షాభావం అలుముకుంటే నీరు తగ్గిపోయి పంటలు కళ్లముంగిటే ఎండిపోతుంటే విలవిల్లాడాలని గమనించిన రైతులు ఆ సాగును తగ్గించుకోవడానికి మరో కారణం. కొన్నేళ్లుగా జరుగుతున్నదిదే. గతేడాది సీజన్ మొత్తంలో 61512 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. 2014లోనూ ‘వరి’ 50వేల హెక్టార్లకు మించలేదు. అంతకుముందు కూడా అదే పరిస్థితి. ఘనపురం ఆనకట్ట వెలవెల... జిల్లాలో వరి సాగుకు ఘనపురం ఆనకట్ట ప్రసిద్ధి. 0.2 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ఆనకట్ట నిండితే....ఆనకట్టకు చెందిన మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాల్వల సాయంతో ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లకుపైగా వరి సాగులోకి వస్తుంది. నిజానికి 30వేల ఎకరాల వరి సాగుకు సీజన్ మొత్తానికి 2టీఎంసీల నీరు అవసరముంటుంది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే...ఆనకట్టకు వర్షం ద్వారా వరద నీరు వచ్చి వరి ఢోకా ఉండదు. కానీ రెండేళ్లుగా ఆనకట్ట వెలవెలబోతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ 3వేల ఎకరాలకు మించి ‘వరి’ సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలోని పలు రిజర్వాయర్లకు చెందిన ఆయకట్టు సైతం వెలవెలబోతున్నది. ఇదీ ఉదాహరణలు... దౌల్తాబాద్ మండలం వీరానగర్‌కు చెందిన ఉప్పరి రాజయ్య గ్రామంలో తనకున్న సుమారు మూడెకరాల భూమిలో బోర్లు వేసినా నీరు రాకపోవడంతో దానిని ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్ పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు. రాజయ్యకు భార్య రాజమణితో పాటు కొడుకులు కరుణాకర్(డిగ్రీ పూరై్త... ఓపెన్‌లో పీజీ) తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సహాయపడుతున్నాడు. రెండో కొడుకు మధు డిగ్రీ చదువుతున్నాడు. అయితే గత ఆరేళ్లుగా గజ్వేల్ పట్టణ శివారులో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా...వర్షాలు సరిగ కురియకపోవడంతో 3ఎకరాలలో మాత్రమే వరిసాగు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈసారి మాత్రం 4ఎకరాలలో మొక్కజొన్న, ఎకరన్నరలో పత్తి సాగు చేయగా ప్రస్తుతం వరిని మాత్రం ఎకరంన్నరకూ పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాడు.. వానలు సక్కగ పడతలేవ్వు...అందుకనే వరిని తగ్గించిన...అంటూ పేర్కొన్నాడు. - ఇదిలావుంటే జగదేవ్‌పూర్‌కు చెందిన రైతు చంద్రయ్యకు రెండు ఎకరాల భూమి ఉంది. బోరుబావి సాయంతో ఏటా వరి సాగు చేస్తున్నాడు. కానీ ఈసారి వానల్లేక బోరులో నీరు తగ్గింది. ఈ సారి ఎకరంలోనే వరి సాగు చేయడానికి ఆ రైతు సమాయత్తమవుతున్నాడు. రెండేళ్ల నుండి వరి పంట వల్ల నష్టలు వచ్చినాయ్. ఎకరానికి 20 వేల వరకు నష్టపోయిన అంటూ ఆ రైతు వాపోయాడు. వర్షం తగ్గితే...‘వరి’ని తగ్గించుకోవడమే మంచిది -జేడీఏ మాధవీ శ్రీలత గజ్వేల్ జిల్లాలో ఇప్పటివరకు వర్షపాతం తక్కువగానే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే..‘వరి’కి దూరంగా ఉండటమే మేలు. జిల్లాలో 24వేల హెక్టార్ల సాగుకు అవసరమైన వరి నారు సిద్ధంగా ఉంది. ఒకవేళ..వర్షాలు భారీగా కురిస్తే మాత్రం రైతులు వరిని సాగు చేస్తారు. లేని పక్షంలో తగ్గుతుందని భావిస్తున్నాం. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో భూగర్భజలమట్టం తగ్గి..జిల్లాలో ‘వరి’ సాగుకు ప్రతికూల పరిస్థితులేర్పడ్డాయి. -
ఖేడ్‌మే భారీష్
కొట్టుకుపోయిన కల్వర్టులు 55.4మి.మీ. వర్షపతం నమోదు నేలకూలిన విద్యుత్‌స్తంభాలు మెతుకుసీమపై వరుణుడు కరుణచూపుతున్నాడు.. జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. బుధవారం నుంచి ప్రారంభమైన వాన గురువారం ఉదయం వరకు కొనసాగింది. ఖేడ్‌లో 55.4 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి రూట్లో రుద్రారం, పోచారం గ్రామాల సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ ఈదురుగాలులకు మనూరు మండలం బెల్లాపూర్ సబ్‌స్టేçÙన్ సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. మంజీర నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నదిలోకి నీరు వస్తోంది. మరోవైపు.. జిల్లాలోని మధ్య తరహ ప్రాజెక్టు నల్లవాగులో నీటి మట్టం పెరిగింది. పక్షం రోజుల క్రితం 1483 అడుగులు ఉండగా.. ఒక అడుగు పెరిగింది. మరో 9 అడుగులకు నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు. ప్రాజెక్టు నిండితే కుడి కాల్వల పరిధిలోని సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణపూర్, మార్డి, ఇందిరానగర్, కలే్హర్లో 4,100 ఎకరాలు, ఎడమ కాల్వ పరిధిలోని బొక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్లో 1230 ఎకరాల వరకు ఆయకట్టు భూములు సాగులోకివస్తాయి. –నారాయణఖేడ్/మనూరు/కలే్హర్ -
మెతుకుసీమలో మరో కలికితురాయి
జిన్నారం: మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి ప్రకాశించనుంది. మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచిలో రూ.100 కోట్లతో డక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమను నిర్మించారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పరిశ్రమను ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొడకంచిలోని 270 సర్వే నంబర్లో సుమారు 14 ఎకరాల స్థలంలో రెండేళ్ల నుంచి డక్కన్ ఆటో యూనిట్ పరిశ్రమను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 200 మంది వరకు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరో రెండేళ్లలో 2,000 మంది. ఐదేళ్లలో ఆరు వేల మంది వరకు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇతర దేశాల నుంచి బస్సుల తయారీకి సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ బస్సులను సర్వాంగసుందరంగా తయారుచేసి ఎగుమతి చేస్తారు. నెలకు సుమారు మూడు వేల వరకు బస్సులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక పరికరాలను ఈ పరిశ్రమలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే బస్సులను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మరో ఐదేళ్లలో ఇదే ప్రాంతంలో కరోవా బస్సులను తయారు చేసే ప్లాంట్లను కూడా నిర్మించనున్నట్లు పరిశ్రమలవర్గాలు వెల్లడించాయి. అదే విధంగా బస్సులకు ఉపయోగపడే ఇంజన్ల తయారీ ప్లాంట్ల నిర్మాణం కూడా జరగనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేసుకున్న యువతకు ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటైన మొదటి పరిశ్రమ ఇదే కావడం గమనార్హం. కొడకంచి గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉంటుందని గ్రామ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమ తమ ప్రాంతంలో ఏర్పాటు కావటం సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ రావటం సంతోషంగా ఉంది తమ గ్రామ పరిధిలో పరిశ్రమ ఏర్పాటు కావటం సంతోషంగా ఉంది. స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమ యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమవంతు సహాయ సహకారాలను అందిస్తాం. - గోపమ్మ, సర్పంచ్, కొడకంచి మరిన్ని పరిశ్రమలు వస్తాయి ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. కరోవా యూనిట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఐదేళ్లల్లో సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. - రాజిరెడ్డి, పరిశ్ర మ ప్రతినిధి -
మద్యం మాఫియా.. జోరు జిల్లాలో యథేచ్ఛగా దందా
- గోవా, కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమంగా దిగుమతి - బెల్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు - ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటున్నది గోరంతే మద్యం మాఫియా జిల్లాలో వెళ్లూనుకుంది. మద్యం వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంది. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. జోరుగా వ్యాపారాన్ని సాగిస్తోంది. ప్రభుత్వ మద్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్న సదరు ముఠా కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటోంది. ఈ దందా వెనుక కొందరు అధికారుల హస్తమున్నట్టు తెలుస్తోంది. వారి అండదండలతోనే మాఫియా దర్జాగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుందన్న ఆరోపణలున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమ పై మద్యం మాఫియా దాడి చేస్తోంది. మాఫియా దెబ్బకు జిల్లాలోని ప్రభుత్వ మద్యం అమ్మకాలు భారీగా డీలాపడ్డాయి. సదరు ముఠా గోవా రాష్ట్రానికి చెందిన డిస్టిలరీల నుంచి ఇబ్బడిముబ్బడిగా అక్రమ మద్యాన్ని దిగుమతి చేసుకొని బెల్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. ఈ దెబ్బకు ఈ ఒక్క నెలలోనే సుమారు 3.5 లక్షల కేసుల మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. నిరుపేద, సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే ఛీప్, మీడియం బ్రాండ్ లిక్కర్ విక్రయాలు భారీ ఎత్తున పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం దొంగచాటుగా దిగుమతి చేసుకొని వైన్ షాపుల ద్వారా విక్రయించడం వల్లే ప్రభుత్వ మద్యం విక్రయాలు త గ్గుతున్నట్టు ఎక్సైజ్ నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇలాంటి మద్యాన్ని ఎకై ్సజ్ పరిభాషలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) అంటారు. నేర చరిత్ర కలిగిన కొంతమంది ముఠాగా ఏర్పడి పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నారని ఇటీవల జరిగిన ఎకై ్సజ్ అధికారుల సమీక్షలో తేలింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లారీలు, కంటెయినర్ల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తరలిస్తున్నారు. 3.5 లక్షల కేసుల తేడా... ఎక్సైజ్ అధికారుల అంచనాల ప్రకారం ఏటా కనీసం 10 శాతం చొప్పున మద్యం విక్రయాలు పెరగాలి. అందుకు తగ్గట్టుగానే టీఎస్‌బీసీఎల్ అధికారులు వివిధ రకాల బ్రాండ్లకు చెందిన మద్యాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తుంటారు. గత పదేళ్లుగా ఎక్సైజ్ అధికారుల అంచనాల్లో తేడా రాలేదు. కానీ ఈ ఏడాది జిల్లా మద్యం విక్రయాల్లో భారీ తేడా కన్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఇప్పటివరకు 34.5 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోయింది. బీరు అమ్మకాలతో కలిపి రూ.23 కోట్ల ఆదాయం వచ్చింది. 2014 ఏప్రిల్ మాసంలో 38.2 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది. ఎక్సైజ్ శాఖ అంచనాల ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది కనీసం 10 శాతం అంటే 38 వేల కేసుల మద్యం అదనంగా అమ్ముడుపోవాలి. కానీ మద్యం మాఫియా దెబ్బతో 3.5 లక్షల కేసుల మద్యం అమ్మకాల లోటు ఏర్పడింది. తక్కువ ధరకే అక్రమ లిక్కర్... జిల్లాలో మద్యం వినియోగం పెరిగినట్టు కన్పిస్తున్నా అందుకు తగ్గట్టుగా టీఎస్‌బీసీఎల్ నుంచి మద్యం కొనుగోళ్లు జరగలేదు. మీడియం లిక్కర్ బ్రాండ్ కేసు ధర (12 ఫుల్ బాటిల్స్) మన డిపోల్లో రూ.4,800 ఉంది. మాఫియా లీడర్లు డిస్టిలరీల నుంచి కేవలం రూ.1,100కు కొనుగోలు చేసి మద్యం వ్యాపారులకు రూ.2,300కు అమ్ముతున్నారు. మరో రూ.1,000 అధికారుల మామూళ్ల కింద పోతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో వ్యాపారులు మద్యం మాఫియా వలలో పడుతున్నారు. ఈ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మద్యం విక్రయాల్లో తేడా వచ్చినా ఎక్సైజ్ అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు. పట్టుకుంది గోరంతే... గోవాలో అక్రమ మద్యం ఉత్పత్తి చేస్తున్న ఒకే ఒక్క డిస్టిలరీని మాత్రమే మన ఎక్సైజ్ అధికారులు ఇటీవల గుర్తించారు. కొంతమందిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు ద్వారా ఎక్సైజ్ అధికారులు ఆపగలిగింది కేవలం 10 నుంచి 20 శాతం అక్రమ దందాను మాత్రమే. ఇంకా అనేక మాఫియా ముఠాలు జిల్లాలో పని చేస్తున్నట్టు సమాచారం. ‘అధిక ఆదాయం’ కోసం ఎక్సైజ్ అధికారులే పెంచి పోషించిన బెల్ట్ దుకాణాల ద్వారా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని దుకాణాల్లో మద్యం అమ్మకాలు ప్రివిలేజ్ ఫీజు కట్టే స్థాయికి వచ్చినందున వ్యాపారులు అక్రమ మద్యం కోసం ఎగబడుతున్నట్టు సమాచారం. అధికారులు ఎన్ఫోర్స్మెంట్కు పదును పెట్టకపోతే ఎక్సైజ్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది.