దోమను నమ్ముకుని రూ.130కోట్ల వ్యాపారం
దోమను నమ్ముకుని రూ.130కోట్ల వ్యాపారం
Published Fri, Aug 19 2016 11:50 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
సామాన్యుల జేబులకు చిల్లులు
అయినా వదలని దోమరాక్షసులు
దోమ నివారణా ఉత్పత్తుల పేరిట రూ.60 కోట్ల వ్యాపారం
దోమ బారినపడకుండా ప్రజలు చేసే ఖర్చు రూ.70 కోట్ల పైమాటే
జిల్లా జనాభా 44లక్షలు
విశాఖసిటీ జనాభా 21.50 లక్షలు
ఏజెన్సీ జనాభా 6.5 లక్షలు
కుటుంబాలు 11.50 లక్షలు
సిటీలో కుటుంబాల సంఖ్య 5.50 లక్షల
పంచాయతీలు 925
గ్రామాలు 2811
వర్గాల వారీగా ప్రజలు
జిల్లాలో ధనికులు 5 శాతం
ఎగువ మధ్యతరగతి ప్రజలు 15 శాతం
మధ్యతరగతి ప్రజలు 30 శాతం
దిగువ మధ్యతరగతి ప్రజలు 10శాతం
అల్పాదాయ, నిరుపేద వర్గాలు 40 శాతం
దోమల నివారణకు కోసం ఖర్చు చేసే మొత్తం–
ధనికులు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పజలు రూ.500 నుంచి వెయ్యి వరకు
నిరుపేదలకు రూ.100 నుంచి రూ.200 వరకు
దోమల ఉత్పత్తుల అమ్మకాలు నెలకు..(సీజన్‌లో)–
బడా షాపింగ్‌మాల్స్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు
హోల్‌సేల్ దుకాణాల్లో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు
సూపర్ మార్కెట్లలో రూ.15వేల నుంచి రూ.25వేల వరకు
రిటైల్ షాపుల్లో నెలకు రూ.10వేల నుంచి 15వేల వరకు
ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తులుః–
లిక్విడ్స్(ఆల్‌అవుట్, గుడ్‌నైట్ వంటివి) 60 శాతం
హిట్స్ వంటి స్పేయర్స్ 15 శాతం
క్వాయల్స్ 25 శాతం
ఈ గణాంకాలు చాలు మనిషి ప్రాణాలతో చలగాటమాడే దోమపై ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో...ఏ స్థాయిలో ప్రజలు ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి. హోల్‌సేల్, మాల్స్, రిటైల్ షాపుల సంఖ్య జిల్లాలో ఐదారువేల వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ షాపులు 500 వరకు ఉండగా, సుమారు 50కు పైగా మాల్స్, వెయ్యికి పైగా సూపర్‌మార్కెట్స్, 4,500కు పైగా రిటైల్‌దుకాణాలు ఉంటాయని అంచనా. దోమల నిర్మూలన కోసం ఉపయోగించే ఉత్పత్తుల వ్యాపారం చూస్తే ఎంత తక్కువ లెక్కేసుకున్నా నెలకు రూ.ఐదారుకోట్లకు పైగానే టర్నోవర్ జరుగుతోంది. ఇక దోమల నిర్మూలన కోసం ఎవరికి వారు తాము సంపాదించే మొత్తంలో కనీసం 5 నుంచి 10 శాతం సొమ్ము ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ధనికులంతా దోమల నిర్మూలన కోసం ఎక్కువగా లిక్విడ్స్ కొను గోలు చేస్తున్నారు. ఇంట్లో గదుల సంఖ్యను బట్టి ప్రతి నెలా రెండు నుంచి ఐదు వరకు లిక్విడ్స్ వీరు కొనుగోలు చేస్తున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలైతే ఎక్కువగా హిట్స్, బేగాన్ వంటి స్ప్రేయర్స్ నెలంతా సరిపడే విధంగా కనీసం నెలకొకటి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారు కూడా ఎక్కువగా లిక్విడ్స్‌నే వినియోగిస్తున్నారు. బాగా కడు నిరుపేదలు, రిక్షా పుల్లర్స్, భిక్షగాళ్లు మాత్రమే ప్రతి నెలా కనీసం రెండు ప్యాకెట్స్ చొప్పున క్వాయిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇళ్లల్లో దోమలు చొరబడకుండా ఉండేందుకు కిటికీలకు మెస్సులు, దోమతెరలు వంటి ఇతర రక్షణ చర్యలు కోసం సీజన్‌లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనికులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా లెక్కలు వేస్తే దోమల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ప్రతి నెలా అక్షరాల రూ.ఆరేడుకోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.అంటే నెలకు రూ.5కోట్ల చొప్పున లెక్కేసినా ఏడాదికి జరిగే వ్యాపారం రూ.60కోట్ల పైమాటే. అదే విధంగా వీటితో పాటు ఇతర రక్షణ చర్యలకోసం నెలకు రూ.6 కోట్లచొప్పున ఏడాదికి 70 కోట్లకు పైగా తమ కష్టార్జితాన్ని దోమల బారిన పడకుండా ప్రజలు ఖర్చు చేస్తున్నారన్న మాట. ఇవన్నీ సుమారుగా లెక్కలే. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదు. –సాక్షి, విశాఖపట్నం
Advertisement
Advertisement