దోమల ఫ్యాక్టరీ | Mosquito Factory | Sakshi
Sakshi News home page

దోమల ఫ్యాక్టరీ

Published Fri, Mar 18 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

దోమల ఫ్యాక్టరీ

దోమల ఫ్యాక్టరీ


హైదరాబాద్: దోమల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. దోమలద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా మొదలుకొని రకరకాల వ్యాధులు. వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నివారణకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటికితోడు చైనాలో ఓ బృందం ఒక వినూత్నమైన ఆలోచనతో దోమల భరతం పడతామంటోంది. ఇందుకోసం ఓ ఫ్యాక్టరీ నెలకొల్పి ప్రతి వారం రెండు కోట్ల దోమల్ని బయటకు వదులుతామంటోంది. ఉన్న దోమలకు తోడు ఈ కొత్త దోమలెందుకబ్బా? అనేగా మీ సందేహం. చైనాలోని సన్ యాట్‌సెన్ వర్సిటీ శాస్త్రవేత్త జియాంగ్ జీ, మిషిగన్ స్టేట్ వర్సిటీలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో మగ దోమలను మాత్రమే అభివృద్ధి చేస్తారు.

మగవి మనల్ని కుట్టవు... వ్యాధులను వ్యాప్తిచెందించవు. ఈ మగదోమల్లో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మగదోమలు మామూలు ఆడదోమలతో కలిస్తే పుట్టే సంతానం మొత్తానికి వంధ్యత్వం (పిల్లలు పుట్టకపోవడం) వస్తుంది. అవి మళ్లీ సంతానోత్పత్తి చేయలేవు. దీంతో కొన్ని తరాలు గడిస్తే దోమలన్నవి లేకుండా పోతాయి. గత ఏడాది గాంగ్‌జూలోని ఓ దీవిలో ఈ కొత్త దోమలను ప్రయోగాత్మకంగా వదిలి చూశారు. కొద్దికాలంలోనే దోమల సంఖ్య సగానికి తగ్గిందట.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement