
దక్షిణ కోరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎల్జీ గ్రూప్ మాజీ చైర్మన్ కూ చా క్యుంగ్ (94)మరణించారు. కూ చా క్యుంగ్ శనివారం ఉదయం 10గంటలకు మరణించారని ఎల్జీ ప్రకటించింది.1925లో కూ చా క్యుంగ్ జన్మించారు. ఎల్జీ వ్యవస్థాపకుడు, కూ చా క్యుంగ్ తండ్రి కూ ఇన్ హ్వోమ్ నుంచి వారసత్వంగా ఎల్జీ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్జీ గ్రూప్‌కు 25సంవత్సరాలు కూ తన సేవలను అందించాడు. కూ రిటైర్‌మెంట్ తర్వాత పెద్ద కుమారుడు మిస్టర్ కూ బాన్ మూ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు. విశిష్ట సేవలను అందించిన కూ బాన్ మూ గత మే నెలలో మరణించారు. ప్రస్తుతం ఎల్జీ గ్రూప్ చైర్మన్‌గా మిస్టర్ కూ క్వాంగ్ మో వ్యవహరిస్తున్నారు. కూ చా క్యుంగ్ రిటైర్‌మెంట్ తర్వాత గ్రామీణ వాతావరణంలో గడిపారు. పుట్టగొడుగుల పై కూ పరిశోధన చేశారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎల్జీ గ్రూప్ నూతన ఒరవడి సృషించిన విషయం తెలిసిందే. ఎల్జీ గ్రూప్ కేవలం ఎలక్ట్రానిక్స్‌లోనే కాక ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి వినియాగదారులకు ఉపయోగపడే వస్తువులను అందిస్తోంది. పండగ వేళల్లో భారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు చేరువయింది. క్వాలిటీ విషయంలో ఎల్జీ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిందని వ్యాపార నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎల్జీని ప్రపంచ స్థాయిలో అగ్రభాగాన కొనసాగడానికి కూ చా క్యుంగ్ ఎంతో శ్రమించారని ఫెడరేషన్ ఆఫ్ కొరియన్ ఇండస్ట్రీస్ గతంలో ఓ ప్రకటనలో తెలిపిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment