న్యూఢిల్లీ: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, జీ3 బీట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.25,000 అని ఎల్‌జీ మొబైల్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు.
అత్యున్నతమైన ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలోనే లభ్యం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారని, అందుకే ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటు ధరలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకు ముందు తామందించిన ఎల్‌జీ జీ3కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతోనే ఈ జీ3 బీట్‌ను అందిస్తున్నామని వివరించారు. ఈ జీ3 సిరీస్ ఫోన్లతో ఈ ఏడాది చివరికల్లా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని ఎల్‌జీ లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో రూ.800 కోట్లుగా ఉన్న తమ స్మార్ట్‌ఫోన్‌ల ఆదాయం ఈఏడాది రూ.2,000 కోట్లను దాటుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ అంచనా వేస్తోంది.
ఎల్‌జీ జీ3 బీట్ @ రూ.25,000
Published Thu, Sep 18 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement
Advertisement