ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వి సిరీస్‌లో తరువాతి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ పేరుతోవిడుదల చేసింది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు మొత్తం ఐదు కెమెరా లెన్సస్‌తో లాంచ్ చేసింది. నాలుగు రంగుల ఆప్షన్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్‌మాక్స్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా.
12 ఎంపీ స్టాండర్డ్ కెమెరా, 16 ఎంపీ సూపర్‌వైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపీ పోర్ట్రయిట్ కెమెరాను రియర్ సైడ్ అమర్చింది. అమెరికాలో అక్టోబర్ 19నుంచి విక్రయానికి లభ్యం. భారతదేశం లో విడుదల తేదీ ఇంకా బహిర్గతం కాలేదు.
ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ ఫీచర్లు
6.4 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ ఓరియో 8.1
3120 x 1440 రిజల్యూషన్
స్నాప్ డ్రాగన్ 845ప్రాసెసర్
6జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
ఎస్‌డీ కార్డ్‌ద్వారా2టీబీదాకా విస్తరించుకునే అవకాశం
12+16+12 ఎంపీ రియర్‌కెమెరా
5+8 ఎంపీ సెల్పీ కెమెరా
3,300 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు 67,980 రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment